
కర్ణాటక : రాతి శిలల మధ్య సవ్వడి చేస్తూ సాగే జలం..అలసట ఎరుగని నిరంతర గమనం.. ప్రకృతికి స్వేతవస్త్రం పరిచిన జలపాతం. ఆకాశ గంగలా వందలాది అడుగుల ఎత్తు నుంచి దుమికే నీటి సోయగాలను చూస్తే మనసు పులకరిస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు దేశంలో ఎన్నో ఉన్నాయి.
వీటిలో పేరొందిన, పర్యాటకులను ఆకట్టుకునే జలపాతాలు రాష్ట్రంలో హోరెత్తుతుంటాయి. జీవితంలో ఒకసారైనా సందర్శించే ప్రముఖ జలపాతాలు కర్ణాటకలో ఉన్నాయి. ఏటా జూన్ 16న అంతర్జాతీయ జలపాత దినోత్సవం నిర్వహిస్తారు. జోగ్ జలపాతం (Jog Falls)--శరావతి నదిపై ఉన్న జోగ్ జలపాతం 253 మీటర్ల నుంచి వయ్యారంగా జాలువారుతుంది.
దీనిని భారతదేశ నయాగరా అని కూడా పిలుప్తారు. ఇరుపు జలపాతం (Irupu Falls)--బ్రహ్మగిరి పర్వతశ్రేణిలో ఉన్న ఇరుప్పు జలపాతం సహజ సౌందర్యంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు బండరాయిపైకి బాణం వేయడంతో ఇరుప్పు జలపాతం ఏర్పడిందని భక్తుల నమ్మకం.
శివసముద్రం (Shivasamudram) --శివసముద్ర జలపాతం కావేరి నది రెండుగా చీలేచోట గగనచుక్కి, భరచుక్కి అనే రెండు అద్భుతమైన జలపాతాలు ఉద్భవిస్తాయి. బెళగావి జిల్లాలో గోకాక్ జలపాతం ఘటప్రభనది పురాతన ఇసుకరాతికొండలమీదుగా సుమారు 52 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంది.
గోకాక్ జలపాతం (Gokak Falls)--గోకాక్ జలపాతం భారతదేశంలోని కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘటప్రభ నదిపై ఉన్న జలపాతం. ఈ జలపాతం గోకాక్ పట్టణానికి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాగోడ్ జలపాతం (Magod Falls)---కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో, ఎల్లాపూర్ (Yellapur) సమీపంలో ఉంది.
బెడ్తి (Bedti) నది పశ్చిమ కనుమల గుండా ప్రవహిస్తూ, 650 అడుగుల (సుమారు 200 మీటర్ల) ఎత్తు నుండి రెండు పాయలుగా లోతైన లోయలోకి దూకే ఈ జలపాతం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. హెబ్బే జలపాతం (Hebbe Falls)---ఇది చిక్మగళూరు జిల్లాలో ఉంది.
Jun 18 2026 9:13 AM | Updated on Jun 18 2026 9:13 AM
కర్ణాటక : రాతి శిలల మధ్య సవ్వడి చేస్తూ సాగే జలం..అలసట ఎరుగని నిరంతర గమనం.. ప్రకృతికి స్వేతవస్త్రం పరిచిన జలపాతం. ఆకాశ గంగలా వందలాది అడుగుల ఎత్తు నుంచి దుమికే నీటి సోయగాలను చూస్తే మనసు పులకరిస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో పేరొందిన, పర్యాటకులను ఆకట్టుకునే జలపాతాలు రాష్ట్రంలో హోరెత్తుతుంటాయి. జీవితంలో ఒకసారైనా సందర్శించే ప్రముఖ జలపాతాలు కర్ణాటకలో ఉన్నాయి. ఏటా జూన్ 16న అంతర్జాతీయ జలపాత దినోత్సవం నిర్వహిస్తారు.
జోగ్ జలపాతం (Jog Falls)--శరావతి నదిపై ఉన్న జోగ్ జలపాతం 253 మీటర్ల నుంచి వయ్యారంగా జాలువారుతుంది. దీనిని భారతదేశ నయాగరా అని కూడా పిలుప్తారు.
ఇరుపు జలపాతం (Irupu Falls)--బ్రహ్మగిరి పర్వతశ్రేణిలో ఉన్న ఇరుప్పు జలపాతం సహజ సౌందర్యంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు బండరాయిపైకి బాణం వేయడంతో ఇరుప్పు జలపాతం ఏర్పడిందని భక్తుల నమ్మకం.
శివసముద్రం (Shivasamudram) --శివసముద్ర జలపాతం కావేరి నది రెండుగా చీలేచోట గగనచుక్కి, భరచుక్కి అనే రెండు అద్భుతమైన జలపాతాలు ఉద్భవిస్తాయి. బెళగావి జిల్లాలో గోకాక్ జలపాతం ఘటప్రభనది పురాతన ఇసుకరాతికొండలమీదుగా సుమారు 52 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంది.
గోకాక్ జలపాతం (Gokak Falls)--గోకాక్ జలపాతం భారతదేశంలోని కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘటప్రభ నదిపై ఉన్న జలపాతం. ఈ జలపాతం గోకాక్ పట్టణానికి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మాగోడ్ జలపాతం (Magod Falls)---కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో, ఎల్లాపూర్ (Yellapur) సమీపంలో ఉంది. బెడ్తి (Bedti) నది పశ్చిమ కనుమల గుండా ప్రవహిస్తూ, 650 అడుగుల (సుమారు 200 మీటర్ల) ఎత్తు నుండి రెండు పాయలుగా లోతైన లోయలోకి దూకే ఈ జలపాతం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
హెబ్బే జలపాతం (Hebbe Falls)---ఇది చిక్మగళూరు జిల్లాలో ఉంది. పచ్చని తోటలగుండా ప్రవహిస్తూ రెండు దశల్లో 168 మీటర్ల ఎత్తునుంచి కిందికి జాలువారుతుంది. ఈ దృశ్యం పర్యాటకులను మైమరిపిస్తుంది.
కుంచికల్ జలపాతం (Kunchikal Falls) ---శివమొగ్గ జిల్లా మాస్తికట్టె నిడగోడు గ్రామం వద్ద కుంచికల్ జలపాతం 1,493 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ఖ్యాతి ఘడించింది. స్థానికులు ఈ జలపాతాన్ని కుంచికల్ అబ్బే అని పిలుస్తారు.
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు)
కడపలో ఏపీఎల్ సందడి...పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు)
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు)
చిన్నారి జాను మిస్సింగ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన DSP
లాకప్ డెత్ టు మేకప్ కిట్టు.. ఇంత డైవర్షన్ ఎందుకు అనిత గారూ ?
YSRCP ఆఫీస్ లో బాత్ రూమ్ లు కడుగుతూ విన్నావా..!?
మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్.. నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు
పచ్చని తోటలగుండా