
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు.
Jun 18 2026 8:17 AM | Updated on Jun 18 2026 8:17 AM
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.
ఎనిమిదేళ్లుంటాయ్ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..
ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.
మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్‌కు మెయిల్ లేదా వాట్సాప్ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసాలు (ఫొటోలు)
కడపలో ఏపీఎల్ సందడి...పాటలతో ఉర్రూతలూగించిన గాయని సునీత (ఫొటోలు)
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు)
హీరోయిన్ అంజలి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్.. నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు
ఇరాన్ తో US రహస్య ఒప్పందం.. ఇజ్రాయెల్ కు ట్రంప్ షాక్
రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత
కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?