
విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్టుడే: ఇటీవలి తన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఉద్దేశించి చేసినవి కావని వైకాపా నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కొద్ది రోజులుగా నాపై తెదేపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.
గతంలో వైఎస్ విజయమ్మ, భారతిల గురించి హోంమంత్రి అనిత మాట్లాడిన సంస్కారహీనమైన భాషను మాత్రమే ఖండించా. మూడు తరాల రాజకీయ కుటుంబనేపథ్యం ఉన్న నేను ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు. మాజీ మంత్రినన్న గౌరవం లేకుండా నన్ను వాడెవడు అని హోంమంత్రి ప్రశ్నించడం ఆమె అహంకారానికి నిదర్శనం.
నా వ్యాఖ్యలపై పోలీసు కేసులు పెట్టినా భయపడను’ అని వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.