
Pawan Kalyan visits ailing fan Niranjan in Telangana : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటించి ఒక బాలుడిని పరామర్శించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్...
Pawan Kalyan visits ailing fan Niranjan in Telangana : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటించి ఒక బాలుడిని పరామర్శించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన విడ్డూరంగా ఉందంటూ ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అనేక సమస్యలతో జనసైనికులు, సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే వారిని పట్టించుకోని డిప్యూటీ సీఎం.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎవరో ఒక బాలుడికి ఒంట్లో బాగాలేదని తెలియగానే అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల కష్టాలను పవన్ పూర్తిగా విస్మరించారని పేర్ని నాని ఆరోపించారు.
Read Also : ఇద్దరం కలిసి ‘OG’ చూద్దాం.. నిరంజన్ కు పవన్ హామీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ వైఖరిని పేర్ని నాని తీవ్రంగా ఎండగట్టారు. “ఇక్కడ ఏపీలో తన కొడుకు అన్యాయంగా చనిపోయాడని ఒక కన్నతల్లి గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు డిప్యూటీ సీఎంకు కనపడటం లేదు.. ఇళ్లు నేలమట్టం చేసి రోడ్డున పడేశారని పేదలు నెత్తీనోరూ బాదుకుంటుంటే ఆ ఆవేదన ఆయనకు వినపడటం లేదు” అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, సొంత పార్టీ అయిన జనసేన కార్యకర్తలే (జనసైనికులు) తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు తమ ఆస్తులను బలవంతంగా లాక్కుంటున్నారని నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా పవన్ కళ్యాణ్ కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సొంత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ప్రజా సమస్యలను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో పరామర్శల రాజకీయం చేయడం పవన్‌కే చెల్లిందంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.
Trump – Modi Meeting : ట్రంప్ కు మోదీ అభినందన
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Beach Shacks : విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్.. జీవో జారీ
Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సీబీఐ విచారణకు డిమాండ్
Shyamala: హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు
Perni Nani: అమర్నాథ్కు మద్దతుగా పేర్ని నాని.. పవన్ కల్యాణ్ పై విమర్శలు
Nara Lokesh: మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్
Achchennaidu: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు