తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు జోసెఫ్ విజయ్ను ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు బుధవారం చెన్నైలో కలిశారు. విజయ్ కేవలం వెండితెరకే పరిమితమయ్యే కథానాయకుడు కాదని, అంతకుమించిన గొప్ప బాధ్యతలను నిర్వర్తించేందుకే ఆయన జన్మించారని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ భేటీ అనంతరం ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్టును పంచుకున్నారు."చెన్నైలో అడుగుపెట్టగానే ఈరోజు అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. మన ముఖ్యమంత్రిని కలవబోతున్నానన్న ఆలోచన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. విజయ్ సార్ కేవలం వెండితెర హీరోగా మాత్రమే ఉండాల్సిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపిస్తుండేది.
ఆయనకున్న ప్రజాబలం, ప్రజలు ఆయన పట్ల చూపే ఆదరణ చూస్తుంటే, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన వ్యక్తి అని నా నమ్మకం" అని సమంత తన పోస్టులో పేర్కొన్నారు.అత్యున్నత స్థాయిలో ఉన్న సినీ కెరీర్‌ను వదులుకుని, ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదని, అందుకు ఎంతో ధైర్యం కావాలని ఆమె కొనియాడారు. "అటువంటి సవాలును స్వీకరించే సాహసం కొందరికే ఉంటుంది.
తనను నమ్మిన వారి అంచనాలను ఆయన కచ్చితంగా అధిగమిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆమె తెలిపారు. ఈ నూతన ప్రయాణంలో విజయ్‌కు సంపూర్ణ శక్తి, వివేకం, ధైర్యం చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఈ క్రమంలోనే ఆయన మే 10న