
Venky -Anil Ravipudi Movie : విక్టరీ వెంకటేశ్, వైవిధ్యభరిత కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ చిత్రంపై టాలీవుడ్లో సరికొత్త ఊహాగానాలు షురూ అయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీనే టైటిల్‌గా మారుస్తూ ‘జనవరి 13 విడుదల’ అనే క్రేజీ పేరును లాక్ చేసినట్లు సమాచారం. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే మార్కు వినోదం, మార్కెటింగ్ స్ట్రాటజీకి తగ్గట్లే ఈ విభిన్నమైన టైటిల్ ఉండటంతో, ఇటు నందమూరి, అటు దగ్గుబాటి అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Also : సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తూ గ్లామర్ హంగులను అద్దబోతున్నారు. గతంలో వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగను సృష్టించగా, ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ మల్టీస్టారర్ అంతకు మించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోందని టాక్.
ఈ చిత్రానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే వెంకటేశ్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండటం, దానికి తోడు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ నటన తోడవనుండటంతో 2027 సంక్రాంతి రేసులో ఈ ‘జనవరి 13 విడుదల’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Keerthy Suresh Sathyavan Savithri Movie: కీర్తి సురేష్ ‘సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Sanchita Ugale: సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు
Shannon Rosario: జియోహాట్‌స్టార్’ బిగ్ మూవ్: యాడ్ సేల్స్ డైరెక్టర్‌గా షానన్ రొసారియోకు ప్రమోషన్
Bandla Ganesh Donation:పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం!
Arbaaz Khan: కోల్‌కతాలో నటుడు అర్బాజ్ ఖాన్ కారులో గుర్తుతెలియని వ్యక్తి
Donald Trump: జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు