
Supreme Court: డిజిటల్ మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకునే సైబర్ కేటుగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సైబర్ మోసం కేసు విచారణ సందర్భంగా నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం స్పష్టంగా నిరాకరించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, ఇలాంటి నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను (FIRs) ఒకేచోటికి చేర్చాలన్న నిందితుడి అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
read also: Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ విచారణ సందర్భంగా ధర్మాసనం నిందితుడి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. “మీలాంటి వారు సమాజంలో అమాయక మదుపరులను నమ్మించి, వారి కష్టార్జితాన్ని వంచిస్తూ బతికే పరాన్నజీవులు (Parasites)” అని జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ తరహా నేరగాళ్లు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎంతోమంది సామాన్యులను డిజిటల్ వలలో వేసుకుని నిలువునా ముంచుతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆన్లైన్ నేరగాళ్లు సమాజంలో స్వేచ్ఛగా తిరగడం కంటే జైల్లోనే ఉండటం ప్రజా ప్రయోజనాలకు ఎంతో శ్రేయస్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఇటీవల కాలంలో దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న “డిజిటల్ అరెస్ట్” లాంటి అత్యాధునిక స్కామ్‌ల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఆన్లైన్ దోపిడీల వల్ల ముఖ్యంగా వృద్ధులు, మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని, కోట్ల రూపాయల సంపదను కోల్పోతున్నారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్
Operation Kagar: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..మహిళా నేత శకుంతల సరెండర్
Sadhu Dulal Giri Ji Maharaj : భగవంతుని సాక్షాత్కారం కోసం 12 ఏళ్లుగా నిలబడే దీక్ష !!
Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా?
Congress On Amit Shah : ‘ఆపరేషన్ ఆకర్ష్’పై అమిత్ షాపై కాంగ్రెస్ నిప్పులు
బాధితులకు అండగా నిలవాలంటే, ఇలాంటి ఆర్థిక నేరస్థులను ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినమైన న్యాయపరమైన చర్యలతో కట్టడి చేయడమే ఏకైక మార్గమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సీబీఐ విచారణకు డిమాండ్