
ఇంటర్నెట్ డెస్క్: ఇండో-అమెరికన్ వ్యోమగామి అనిల్ మేనన్ (Astronaut Anil Menon) అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జులై 14న ప్రారంభం కానున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు అనిల్.. మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలతో కలిసి వెళ్లనున్నారు.
వారు 240 రోజుల పాటు కక్ష్యలో గడపనున్నారు. జూన్ 22న అనిల్ మేనన్ ఇంటర్వ్యూలు ఇస్తారని నాసా వెల్లడించింది. భారత్, ఉక్రెయిన్ తల్లిదండ్రులకు జన్మించిన అనిల్.. అమెరికా పౌరుడు. 2021లో ఆయన వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2024లో 23 ఆస్ట్రోనాట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయ్యారు.
అంతకుముందు హార్వర్డ్ నుంచి న్యూరోబయాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్, మెడికల్లలో మాస్టర్ డిగ్రీలను అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈయన వ్యోమగామిగానే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్, మెకానికల్ ఇంజినీర్, అమెరికా స్పేస్‌ఫోర్స్ కర్నల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వ్యోమగామి కాకముందు అనిల్ నాసా ఎక్స్‌పెడిషన్ ఫ్లైట్ సర్జన్‌గా పనిచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని వ్యోమగాములకు సహకరించేవారు. 2021లో నాసా తన వ్యోమగాముల బృందంలో అనిల్‌ను ఎంపిక చేసింది. రెండేళ్ల శిక్షణ తర్వాత 2024లో ఆయన వ్యోమగామిగా పట్టభద్రుడయ్యారు.
నాటినుంచి కక్ష్యలోకి తన మొదటి అంతరిక్ష యాత్ర కోసం సిద్ధమవుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.