
ఇండస్ట్రీలో ఒకసారి ఫేడ్ అవుట్ అయ్యాక.. మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించిన డైరెక్టర్స్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇండస్ట్రీలో ఒకసారి ఫేడ్ అవుట్ అయ్యాక..
మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించిన డైరెక్టర్స్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి దర్శకులలో శ్రీను వైట్ల (Srinu Vaitla) కూడా ఒకరు. ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
2024 లో గోపీచంద్ తో కలిసి విశ్వం సినిమాను తెరకెక్కించాడు శ్రీను వైట్ల. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక దాదాపు రెండేళ్ల తరువాత శ్రీను వైట్ల.. కుర్ర హీరో శర్వానంద్ తో జతకట్టాడు. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సరికొత్త చిత్రం బుధవారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై శ్రీను వైట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి ఎలాగైనా శర్వానంద్ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పక్కా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
శర్వానంద్‌కు ఉన్న క్లాస్ అండ్ మాస్ అప్పీల్, శ్రీను వైట్ల మార్క్ వింటేజ్ కామెడీ, వన్-లైనర్ పంచ్‌లు తోడైతే థియేటర్లలో నవ్వుల పండగ ఖాయమని అంటున్నారు. ఇక శ్రీను వైట్ల ఈ సినిమాను సంక్రాంతి రేసులో దించాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సంక్రాంతి 2027 సీనియర్ హీరోలతో నిండిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా టాలీవుడ్ నాలుగు పిల్లర్స్ సంక్రాంతి బరిలోనే దిగుతున్నారని టాక్. మరి వారందరితో పోటీగా శ్రీను వైట్ల
తన సినిమాను దించుతాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో శ్రీను వైట్ల గట్టెక్కుతాడా.. ? అనేది తెలియాల్సి ఉంది