
తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్‌లో టెస్లా.. ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలో ఐదోది కావడం విశేషం. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ టెస్లా ‘2026 మోడల్ వై ప్రీమియమ్ రేర్ వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్’ వాహనాలను వినియోగదారులు పరిశీలించొచ్చు.
మరోవైపు బొల్లారం పారిశ్రామిక వాడలో డెలివరీ, ఆఫ్టర్ సేల్స్ సేవల కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పటికే టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్లు బెంగళూరు, ముంబయి, దిల్లీ, గురుగ్రామ్‌లో ఉన్నాయి. HYDలో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
|