
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Indiramma Indlu 2nd Phase: ప్రతి ఒక్కరికీ నివాసం ప్రాంతం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని.. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మంత్రి టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా.. ప్రతి కుటుంబం సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి తెలిపారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గుడిసెల గుర్తింపునకు ప్రత్యేక సర్వే రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి సూచించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పొరపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల చొరబాటుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
గుడిసెవాసులకు అవకాశం గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పించనున్నారు.
లబ్ధిదారుడే ఇంటి నిర్మాణదారు బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) విధానంలో లబ్ధిదారుడే తన ఇంటిని నిర్మించుకొనే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జి+1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చు.