
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra Mouth Stitching Video Watch Now: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు ప్రమాదకరమైన వీడియోలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలగడం ఖాయం. అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన ఒక పెద్ద నాగుపామును ఒక వృద్ధుడు పట్టుకొని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూదితో పాము నోరు కుట్టేసిన వృద్ధుడు.. సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. ఇక పిరికివారైతే ఎక్కడ పాము ఉంటే అక్కడికి కిలోమీటర్ దూరంలోకి పరిగెడుతూ ఉంటారు..
అలాంటిది ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు ఏ మాత్రం భయం లేకుండా.. ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అతను.. ఆ పాము తలభాగాన్ని గట్టిగా నొక్కి పట్టి.. ఒక చేతిలోకి సూదితో పాటు దారం తీసుకున్నాడు..
పాము విలవిలలాడుతున్నప్పటికీ సరే.. ఏమాత్రం జాలి లేకుండా దాని మూతి భాగాన్ని సూదితో పొడుస్తూ.. దారంతో నోటిని కొట్టడం ప్రారంభించాడు.. ఆ వృద్ధుడు సూదితో పొడుస్తున్నప్పుడు.. ఆ మూగ జీవి ఎంతో నొప్పితో విలవిలలాడిపోయింది. దాని నోటి భాగం నుంచి కొంచెం రక్తం కారినట్లు కూడా అనిపించింది..
వృద్ధుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఆ నాగుపాము నోటిని పూర్తిగా దారంతో కుట్టేసి బంధించాడు.. దాదాపు 15 నిమిషాల పాటు ఆ పాముని పట్టుకొని ఆ వ్యక్తి అలా నెమ్మదిగా పాము నోటిభాగాన్ని కుడుతూనే కనిపించాడు..
ఇంతకీ ఆ వృద్ధుడు ఎందుకు అలా చేశాడు? సాధారణంగా కొందరు పాములు పట్టేవారు తాము పట్టుకున్న పాములు ఎవరినీ కరవకుండా ఉండేందుకు.. లేదా వాటి విషాన్ని పిండేసి ఇలా నోర్లు కుట్టేస్తూ ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగింది.. ఆ వృద్ధుడు ఎవరు అనే విషయాలపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు.. కానీ ప్రస్తుతం మాత్రం ఆ వృద్ధుడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తూ వస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
అయినప్పటికీ సరే ఆ