
బ్రెజిల్ దేశంలో వరుస విషాదాలు స్థానకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఓ వంతైనపై నుంచి బంగీ జంపింగ్ అంటూ తాడు లేకుండానే కిందకు దూకి 21 ఏళ్ల యువతి మరణించిన ఘటనను మరువక ముందే.. తాజాగా మరో మహిళ కొండపై నుంచి లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది.
రియోడి జెనెరో సమీపంలోని మారిచాలో ఉన్న గ్రుటాస్ డోస్పార్ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిని 59 ఏళ్ల రోజ్మేరీ సుజార్ట్ గార్సియాగా గుర్తించారు. కేవలం దోమల స్ప్రే కొట్టుకునే ప్రయత్నంలో ఆమె అదుపు తప్పి 100 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిసింది.క్షణాల్లో జరిగిన దారుణం మృతురాలు గార్సియా ఓ గ్రూపుతో కలిసి కొండల్లో ట్రెక్కింగ్ కు వెళ్లారు.
ఆ సమయంలో దోమలు కుట్టకుండా ఉండేందుకు ఓ స్ప్రేను చల్లుకోవడానికి ఆమె ఓ వ్యూ పాయింట్ సమీపంలోని ఒక చిన్న మార్గంలోకి వెళ్లారు. ఓ కాలు పైకెత్తి స్ప్రే కొట్టుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఆమె కంట్రోల్ తప్పి కొండ అంచు నుంచి 100 అడుగుల లోయలోకి పడిపోయారు.
ఆమెను కాపాడేందుకు టూర్ గైడ్ శత విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన జియోవాని మాక్సిమినో అనే ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. గార్సియా పడిపోతుండగా గైడ్ వెంటనే స్పందించి ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడని, ఆ క్రమంలో అతడు కూడా దాదాపు కింద పడిపోయే పరిస్థితి వచ్చిందని వెల్లడించాడు.
గైడ్ ఎలాగోలా అక్కడ ఉన్న ఒక చెట్టు వేరును పట్టుకుని తనను తాను కాపాడుకున్నాడని, కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయిందని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో గార్సియా హెల్మెట్, గ్లోవ్స్ వంటి రక్షణ పరికరాలు ధరించినప్పటికీ.. 100 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఆ రాత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.బంగీ జంపింగ్ విషాదం
బ్రెజిల్ దేశంలో వరుస విషాదాలు స్థానకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఓ వంతైనపై నుంచి బంగీ జంపింగ్ అంటూ తాడు లేకుండానే కిందకు దూకి 21 ఏళ్ల యువతి మరణించిన ఘటనను మరువక ముందే.. తాజాగా మరో మహిళ కొండపై నుంచి లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది. రియోడి జెనెరో సమీపంలోని మారిచాలో ఉన్న గ్రుటాస్ డోస్పార్ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిని 59 ఏళ్ల రోజ్‌మేరీ సుజార్ట్ గార్సియాగా గుర్తించారు. కేవలం దోమల స్ప్రే కొట్టుకునే ప్రయత్నంలో ఆమె అదుపు తప్పి 100 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిసింది.క్షణాల్లో జరిగిన దారుణం మృతురాలు గార్సియా ఓ గ్రూపుతో కలిసి కొండల్లో ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో దోమలు కుట్టకుండా ఉండేందుకు ఓ స్ప్రేను చల్లుకోవడానికి ఆమె ఓ వ్యూ పాయింట్ సమీపంలోని ఒక చిన్న మార్గంలోకి వెళ్లారు. ఓ కాలు పైకెత్తి స్ప్రే కొట్టుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఆమె కంట్రోల్ తప్పి కొండ అంచు నుంచి 100 అడుగుల లోయలోకి పడిపోయారు. ఆమెను కాపాడేందుకు టూర్ గైడ్ శత విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన జియోవాని మాక్సిమినో అనే ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. గార్సియా పడిపోతుండగా గైడ్ వెంటనే స్పందించి ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడని, ఆ క్రమంలో అతడు కూడా దాదాపు కింద పడిపోయే పరిస్థితి వచ్చిందని వెల్లడించాడు. గైడ్ ఎలాగోలా అక్కడ ఉన్న ఒక చెట్టు వేరును పట్టుకుని తనను తాను కాపాడుకున్నాడని, కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయిందని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో గార్సియా హెల్మెట్, గ్లోవ్స్ వంటి రక్షణ పరికరాలు ధరించినప్పటికీ.. 100 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ రాత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.బంగీ జంపింగ్ విషాదం మరవకముందే.. ఈ ఘటన జరగడానికి 24 గంటల ముందే సావో పాలోలోని స్కెలిటన్ బ్రిడ్జ్ వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మరియా ఎదువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అనే యువతి రోప్ జంపింగ్ ఈవెంట్‌లో పాల్గొంది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమెకు బంగీ తాడు కట్టకుండానే 130 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి కిందకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బ్రెజిల్‌లో ఇద్దరు మహిళలు ఇలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అక్కడి ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది.