
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని, దీంతో ఐదు నెలలుగా సాగుతున్న యుద్దం ఆగుతుందని, అంతర్జాతీయ చమురు సరఫరా మెరుగుపడుతుందని.. ఇలా ఎన్నోన్నో అనుకున్న వాళ్లకు ఇవాళ ట్రంప్ (Trump) గట్టి షాక్ ఇచ్చారు. ఇరాన్ తో రెండు రోజుల్లో అమెరికా శాంతి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న వాళ్లకు షాకిస్తూ ఇవాళ జీ7 సదస్సులో ట్రంప్..
యూటర్న్ వ్యాఖ్యలు చేశారు.ఒకేరోజు భారత్ కు రెండు షాకులిచ్చిన ట్రంప్..! పాక్ మ్యాప్ లో పీవోకే..! అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి రెండు రోజుల ముందు, ఆ ఒప్పందంలోని అంశాలు తనకు నచ్చకపోతే.. టెహ్రాన్ పై మళ్లీ దాడులు ప్రారంభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు కలకలం రేపాయి.
ఫ్రాన్స్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి జీ7 శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్. .అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరింది తుది ఒప్పందం కాదని తేల్చేశారు. అమెరికాతో శాంతి వద్దు.. లొంగిపోవద్దు! ఇరాన్ వీధుల్లో రగిలిన భారీ నిరసన జ్వాల..!ఇది కేవలం ఒక అవగాహన ఒప్పందం, ఒకవేళ అది నాకు నచ్చకపోతే, మళ్ళీ ఇరాన్ పై కాల్పులు జరుపుతామని, వారి తలలపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు అమెరికా-ఇరాన్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం చాలా బలంగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అది ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ అది చాలా బలంగా ఉందన్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకటన తర్వాత మార్కెట్లు నిజంగా సంతోషంగా ఉన్నాయని, ఒప్పందంపై సంతకం చేసిన ఒకటి రెండు రోజుల తర్వాత హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని, దీంతో ఐదు నెలలుగా సాగుతున్న యుద్దం ఆగుతుందని, అంతర్జాతీయ చమురు సరఫరా మెరుగుపడుతుందని.. ఇలా ఎన్నోన్నో అనుకున్న వాళ్లకు ఇవాళ ట్రంప్ (Trump) గట్టి షాక్ ఇచ్చారు. ఇరాన్ తో రెండు రోజుల్లో అమెరికా శాంతి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న వాళ్లకు షాకిస్తూ ఇవాళ జీ7 సదస్సులో ట్రంప్.. యూటర్న్ వ్యాఖ్యలు చేశారు.ఒకేరోజు భారత్ కు రెండు షాకులిచ్చిన ట్రంప్..! పాక్ మ్యాప్ లో పీవోకే..! అమెరికా, ఇరాన్‌ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి రెండు రోజుల ముందు, ఆ ఒప్పందంలోని అంశాలు తనకు నచ్చకపోతే.. టెహ్రాన్ పై మళ్లీ దాడులు ప్రారంభిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు కలకలం రేపాయి. ఫ్రాన్స్‌లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి జీ7 శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్. .అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరింది తుది ఒప్పందం కాదని తేల్చేశారు. అమెరికాతో శాంతి వద్దు.. లొంగిపోవద్దు! ఇరాన్ వీధుల్లో రగిలిన భారీ నిరసన జ్వాల..!ఇది కేవలం ఒక అవగాహన ఒప్పందం, ఒకవేళ అది నాకు నచ్చకపోతే, మళ్ళీ ఇరాన్ పై కాల్పులు జరుపుతామని, వారి తలలపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా-ఇరాన్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం చాలా బలంగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అది ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ అది చాలా బలంగా ఉందన్నారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకటన తర్వాత మార్కెట్లు నిజంగా సంతోషంగా ఉన్నాయని, ఒప్పందంపై సంతకం చేసిన ఒకటి రెండు రోజుల తర్వాత హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు.