
ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పూర్వం ఉలవలనే అధికంగా ఆహారంగా తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఉలవలను తినేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. గుర్రాలకు మాత్రం వీటిని పెడుతుంటారు. అయితే వీటిని కొంతమంది తినవచ్చు… కానీ కొందరు మాత్రం తినకూడదు.
జిమ్‌కి వెళ్లి బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? దానికి ఉలవ చారు తాగండి. ఇది శరీరంలోని అనవసర కొవ్వును కరిగించేస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఉలవలు తింటే ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరిగేవారు ఉలవలు తింటే ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధంగా మారుతుంది.
షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్లోకి వస్తాయి. ఛాతీలో కఫం పట్టడం, వేధించే దగ్గుకు ఉలవ చారు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందించి, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఉలవలకు సహజంగానే వేడి చేసే గుణం అధికంగా ఉంటుంది.
శరీర వేడి సమస్య, పైల్స్ (Piles), లేదా నోటి పూతతో బాధపడేవారు ఉలవలతో చేసిన ఆహారం తినకపోవడమే మంచిది. ఇక గర్భం ధరించాక శరీరంలో వేడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ఉలవలు తినడం ప్రమాదకరం. దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువ.
అనవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉలవల్లో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉలవలతో చేసిన ఆహారాలు తినకపోవడమే ఉత్తమం
.