రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిని అన్ని రంగాల్లో నెం.1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు.2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ, ఆవేదన తనలో కసి పెంచిందని లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఆ కసితోనే ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నానని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలు తనకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, తాగునీరు, గ్యాస్ పైప్ లైన్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వంద పడకల ఆసుపత్రి, పార్కులు, కమ్యూనిటీ భవనాలు, స్మశాన వాటికల అభివృద్ధి వంటి పనులు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
"పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఆయన వారంలో మూడు రోజులు బెంగళూరు, ఒకరోజు తాడేపల్లి, మరో మూడు