
దీపావళి పండగ వచ్చిందంటే కొత్త సినిమాలకు కొదవే ఉండదు. అందులోనూ తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. కానీ, గత కొన్నేళ్లుగా పెద్ద హీరోల సినిమాలు దీపావళికి రాలేదు.
ఆ లోటును తీర్చేలా 2026 దీపావళికి రెండు భారీ చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. దీంతో ఈసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయం. ఈ ఏడాది దీపావళి రేసులో దిగిన మొదటి సినిమా 'అరసన్'. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.
'వడ చెన్నై' యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శింబుతో పాటు ప్రియాంక మోహన్, ఆండ్రియా, సముద్రఖని, విజయ్ సేతుపతి లాంటి పెద్ద తారాగణం ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది
.