
జీవితంలో డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఎంత ముఖ్యమో, కష్ట సమయంలో మన వెంట నిలిచే ఒక మంచి స్నేహితుడు కూడా అంతే ముఖ్యం. సంతోషంలో ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ.. కష్టాల్లో అండగా నిలిచి, మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే నిజమైన స్నేహితులు చాలా అరుదు.
అయితే జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వ్యక్తులకు అలాంటి అరుదైన స్నేహితులు ఉంటారట. మరి ఆ అదృష్ట తేదీలేంటో చూద్దామా.. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2వ తేదీన జన్మించిన వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
స్నేహాన్ని ఎంతో విలువైందిగా భావిస్తారు. ఒకసారి ఎవరితో అయినా స్నేహం చేస్తే వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. అందుకే వీరికి కూడా జీవితాంతం అండగా నిలిచే స్నేహితులు దొరుకుతారని పండితులు చెబుతున్నారు. ఏ నెలలో అయినా 11వ తేదీన జన్మించిన వారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
వీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. కష్ట కాలంలో మంచి మాటలతో ధైర్యం చెప్పే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వీరిని స్నేహితులు ఎంతో అభిమానిస్తారు. అవసరమైన సమయంలో వీరి కోసం ఎంత దూరమైనా వెళ్లే మిత్రులు వీరి లైఫ్ లో ఉంటారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం 20వ తేదీన పుట్టిన వారు సంబంధాలను కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చిన్న చిన్న అపార్థాలను పెద్దవి చేయకుండా పరిష్కరించే స్వభావం వీరిది. అందువల్ల వీరి స్నేహాలు ఎక్కువ కాలం నిలుస్తాయి. కాలం మారినా, పరిస్థితులు మారినా వీరి స్నేహితులు వీరిని ఎప్పటికీ మరచిపోరని పండితులు చెబుతున్నారు.
ఏ నెలలో అయినా 29వ తేదీన జన్మించిన వారు భావోద్వేగపరంగా బలంగా ఉంటారు. స్నేహితుల కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరి నిజాయతీ, అంకితభావం ఇతరులను బాగా ఆకట్టుకుంటాయి. అందువల్ల వీరి జీవితంలో
కనీసం ఒకరైనా ప్రాణ స్నేహితుడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.