
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Pawan Kalyan Fan Boy: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ను స్వయంగా కలసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేశాయి. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. తన అభిమాన హీరోను ఒక్కసారి అయినా కలవాలని అతని కోరిక ఉండటంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది.
వెంటనే స్పందించిన ఆయన నిరంజన్ ఇంటికి వెళ్లి అతనితో చాలా సమయం గడిపారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ధైర్యంగా ఉండాలని సూచించారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అయితే ఈ భేటీలో జరిగిన ఒక సంభాషణ అందరి హృదయాలను తాకింది. నిరంజన్‌తో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అతనికి ప్రత్యేక హామీ ఇచ్చారు. "నేను ఓజీ రెండో భాగం చేస్తే తప్పకుండా మన ఇద్దరం కలిసి ఆ సినిమా చూద్దాం" అని చెప్పారు.
అంతేకాకుండా "ఓజీ 2 సినిమా వస్తే ఆ కార్యక్రమానికి నువ్వే చీఫ్ గెస్ట్" అని చెప్పి నిరంజన్ ముఖంలో చిరునవ్వు తెప్పించారు. ఈ సందర్భంగా కుటుంబ జీవనోపాధి గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆరా
తీశారు. వారికి స్థిరమైన ఉపాధి కల్పించేందుకు పార్టీ నాయకులకు సూచనలు చేశారు. అలాగే నిరంజన్ కోరిక మేరకు కుక్క పిల్లను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
పరామర్శ అనంతరం పవన్ కళ్యాణ్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి నిరంజన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానిపై ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.