
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ktr Fires on cm revanth reddy and minister ponguleti Srinivasa reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకిచెందిన నేతల మధ్య మాటలయుద్దం, సవాళ్ల పర్వం ఇప్పట్లో ఆగేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఖమ్మంజిల్లాలోని వెంకటగిరి లో SIR శిక్షణ సమావేశంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం తరువాతకూడా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ నాకు ఆదర్శం అంటున్నాడని, వెలుగుమట్ల లో రాక్షసుడు లాగా అర్ధరాత్రి వెయ్యి ఇళ్ళు కూలగొట్టాడని ఏకీపారేశారు.
పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రి కి పైశాచిక ఆనందంగా అనిపిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దండుపాళ్యం నాయకులుగా మారారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలైందని అన్నారు.
రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోందని విమర్శలుగుప్పించారు. రాష్ట్రంలో యూరియా లేదని, కరెంటు లేదు, రైతుబంధు లేదు, ధాన్యం కొనే దిక్కులేదని ప్రభుత్వతీరును తూర్పార బట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి అక్రమాలు రోజుకు ఒక్కటి బయటకు వస్తున్నాయన్నారు.
ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని గుర్తు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మోడీ కాళ్లు పట్టుకున్నాడని, అందుకే ED దాడులపై కేసులు పెట్టలేదన్నారు. కోటి ఎకరాల భూములు 22A కింద పెట్టారని, రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాస రెడ్డి గజదొంగ అంటూ విమర్శలు గుప్పించారు.
రెండున్నర సంవత్సరాలలో శ్రీనివాసరెడ్డి చేసింది ఏమీ లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అహంకారం చూపెడుతున్నాడన్నారు. అధికారం అడ్డంపెట్టుకుని వట్టినాగులపల్లి లో రైతులపై దాడులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలేరు లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గులాబీ జెండా ఎగురుతుందన్నారు. 20 లక్షల ఇళ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావ్ మాట మీద నిలబడే దమ్ము ఉందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎలక్షన్ ల ముందు ఎస్సీ,ఎస్టీ ఇంటికి లకు అరులక్షల రూపాయల ఇస్తా అనిచెప్పారని, ఆ తర్వాత విధ్వంసం తప్ప వికాసం ఎక్కడ లేదన్నానరు. ఇవ్వాళ రైతుబంధు రావడం లేదని, దేవుని మీద ఒట్టేసి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు.
యూరియా దుకాణం ముందు రైతులు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని, కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తూ మళ్లీ పెడతా అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ కార్డు లు ఏమైనవి అని అడిగితే.. మంత్రి భట్టి విక్రమార్క డైవర్షన్ లు చేస్తు కేసీఆర్ అప్పుల పాలు చేశాడని మాట్లాడుతున్నారని విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి, సీతారామా ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి చేసిన నిజమైన నేత కేసీఆర్ అంటూ కొనియాడారు.
ఖమ్మం లో రెండు నర్సింగ్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజ్ కట్టిచింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు హామీ ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. వానపాము కూడా నాగుపాము లాగా బుసలు కొడుతోందని, మళ్లీ గెలిచేది కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ములుగు జిల్లాలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి మంత్రి పొంగులేటి శ్రీకారం చుట్టాడన్నారు. బూత్ ల వారీగా బలమైన కమిటీ నిర్మాణం జరగాలన్నారు. మన దేశంలోనే మహిళలకు మొట్ట మొదటి ఎన్నికల్లో ఓటు హక్కు వచ్చిందన్నారు. ఓటర్ లిస్టు వడపోత కార్యక్రమం జరుగుతుందన్నారు. SIR ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్ట పోతామన్నారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు, 35,985 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కు BRS పార్టీ నుంచి కూడా ఒక BLA ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అర్హులైన వారి ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాద్యత BRS BLA లదని స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదం గా 10 వేల ఓట్లు ఉన్నాయన్నారు. గెలుపుకు, ఓటమికి ఒక్క ఓటు తేడా ఉంటుందని అందరూ జాగ్రత్తగా చూసుకుని పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంత పెద్ద నాయకుడైన సొంత బూత్ లో మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టాలన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా పని చేస్తేనే రేపు మంచి రోజులు వస్తాయన్నారు.
Read more: Acb raids On Narahari: తండ్రి నుంచి వారసత్వ ఉద్యోగం.. అవినీతి అనకొండ డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు మొదటి జీతం ఎంతో తెలుసా..?
డిజిటల్ యాప్ లోనే BRS పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. పటిష్టమైన కమీటీ నిర్మాణం జరిగితేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కేటీఆర్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ శ్రేణులు దిశానిర్దేషం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఖమ్మం లో ఉన్నది ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్ళని ఏకీపారేశారు. కాంగ్రెస్ మళ్ళీ గెలవదని