
ఇంటర్నెట్ డెస్క్: 320 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 18 ఓవర్లకు స్కోరు 124/3. బాహిర్ షా (28), ఫైసల్ షినోజాదా (34) నాలుగో వికెట్‌కు ఇప్పటివరకు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో భారత్ A బౌలర్లు పట్టుబిగిస్తున్నారు.
క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అఫ్గానిస్థాన్ Aను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు 11 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, అంశుల్ కాంబోజ్, నిశాంత్ సింధు తలో వికెట్ పడగొట్టారు.
అఫ్గాన్ లక్ష్యం 320 పరుగులు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా కీలకమైన మ్యాచ్‌లో భారత A బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అఫ్గానిస్థాన్ Aతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు.
కెప్టెన్ తిలక్ వర్మ (59), ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుషాంగ్రా (58) అర్ధశతకాలు సాధించారు. మిగతా బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో వైభవ్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
అతడు ఇచ్చిన క్యాచ్‌ను అఫ్గాన్ ఫీల్డర్ పట్టినా.. బంతి నేలకు తాకినట్లు రీప్లేలో తేలింది. సూర్యాంశ్ షెడ్జే (7) త్వరగా పెవిలియన్‌కు చేరాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్ (30), నిషాంత్ సింధు (21*) విలువైన పరుగులు రాబట్టారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరిదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మనుల్లా 2..
జహీర్‌ఖాన్ 1 వికెట్ తీశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి
కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.