
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అతను బద్దలుకొట్టాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో లక్నో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. అద్భుతమైన ఫామ్‌తో ఆకట్టుకున్న గిల్, ఈ మ్యాచ్‌లో అర్ధశతకం పూర్తి చేసి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా మరో మైలురాయిని అందుకున్నాడు.
లిస్ట్ ఏ క్రికెట్లో 14,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ కూడా వచ్చారు. ఇక, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ 30 ఓవర్లు ముగిసేరికి 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ శుభారంభం చేసింది.
తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే
.