
ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డేలో అతడు వన్‌డౌన్‌గా వచ్చాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. కెరీర్లో అతడికిది 19వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లకు 120/2.
క్రీజ్‌లో గిల్ (55*), ఇషాన్ కిషన్ (10) ఉన్నారు. అఫ్గానిస్థాన్‌తో రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ (48) కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం భారత్ 13.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
క్రీజ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (42*), ఇషాన్ కిషన్ ఉన్నారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (4) త్వరగా పెవిలియన్‌కు చేరాడు. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియం వేదికగా భారత్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టాస్ నెగ్గిన అఫ్గాన్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ సిరీస్‌పై కన్నేసింది. టీమ్ఇండియా తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. దీంతో ఒకే సిరీస్‌లో భారత్ నుంచి మూడో డెబ్యూ ప్లేయర్‌గా ప్రిన్స్ నిలిచాడు. తొలి వన్డేలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేశారు.
ఈసారి శ్రేయస్ అయ్యర్ చేతులమీదుగా ప్రిన్స్ క్యాప్‌ను అందుకొన్నాడు. రెండో వన్డే కోసం భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ అఫ్గానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, ఖరోటి, ఘజనఫర్, సలీమ్ సాఫి, బిలాల్ సామి గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.