Google Pixel 9a Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లతో చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 48MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పిక్సెల్ 9ఎ ఆఫర్లు, ధర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ధర, ఆఫర్లు : గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ 8GB, 256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ (Google Pixel 9a) క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 37,999కు తగ్గుతుంది.
Read Also : Apple iPhone 17 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ 17 అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
అసలు ధర రూ.49,999 నుంచి ఇప్పుడు రూ.12వేలు చౌకగా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.35,600 వరకు సేవ్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్, ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 9ఎలో 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల యాక్చువా pOLED డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కొలతల పరంగా 154.7 మిమీ పొడవు, 73.3 మిమీ వెడల్పు, 8.9 మిమీ మందం, 185.9 గ్రాముల బరువు ఉంటుంది.
కెమెరా పరంగా పిక్సెల్ 9aలో ఎఫ్/1.7 అపర్చర్, ఓఐఎస్ సపోర్ట్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, NFC, జీపీఎస్, NavIC,యూఎస్బీ 3.2 టైప్-సి పోర్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.