
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pawan Kalyan Fan Niranjan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ యువ అభిమానికి చిరకాల కోరిక తీర్చారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన..
మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వరంగల్‌లోని హనుమకొండకు చెందిన నిరంజన్ అనే అభిమాని కోసం డిప్యూటీ సీఎం స్వయంగా కదిలారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కల్యాణ్‌పైకి దూసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిరంజన్ పరామర్శ కోసం హనుమకొండ వెళ్లిన టాలీవుడ్ కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ అడుగుడుగునా బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు అభిమానుల తాకిడి భారీగా పెరిగింది.
అయితే నిరంజన్ ను పరామర్శించేందుకు తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఓ అభిమాని పవన్ వైపు దూసుకెళ్లాడు. అంతలోనే ఆయన భద్రతా సిబ్బంది అభిమానిని పక్కకు నెట్టేశారు. అభిమాని కోసం కదలి వచ్చి..రూ.1 లక్ష సాయం! అనారోగ్యంతో మంచాన పట్టిన ఆ వ్యక్తి కోసం ఏకంగా పవర్‌స్టార్ ఆ అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు.
అరుదైన వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ నిరుపేద అభిమాని చిరకాల కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. ఆర్థిక సాయంగా రూ. లక్ష ఇచ్చి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అభిమానిని పరామర్శిస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ (17) అనే యువకుడు డి.ఎన్.డి (Duchenne Muscular Dystrophy) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. శరీర ఎదుగుదల లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమైన నిరంజన్.. తన చివరి కోరికగా తన అభిమాన హీరో అయిన పవన్ కల్యాణ్‌ను ఒక్కసారైనా చూడాలని తల్లిదండ్రులకు తెలిపాడు.
ఈ విషయాన్ని నిరంజన్ తల్లిదండ్రులు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే అధినేత పవన్ కల్యాణ్‌కు సమాచారం అందించారు. అభిమాని పరిస్థితిని వినగానే చలించిపోయిన పవన్ కల్యాణ్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటీన హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకున్నారు.
అభిమాని నిరంజన్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. ఆ తర్వాత నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలను అడిగి తెలుసుకున్న పవన్.. వారి కుటుంబానికి శాశ్వత జీవనోపాధి లభించేలా ఒక 'క్యాంటిన్' ఏర్పాటు చేయించాలని తెలంగాణకు చెందిన జనసేన నేతలను ఆదేశించారు.
అభిమాని కోసం ప్రత్యేక పూజలు.. ఈ సందర్భంగా బాలుడికి భద్రకాళి అమ్మావారి తీర్థప్రసాదాలు అందజేసి ధైర్యం చెప్పారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన మాట ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడితో పవన్ కల్యాణ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, ధైర్యం చెప్పడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కష్టాల్లో ఉన్న అభిమానికి దేవుడిలా వచ్చి అండగా నిలిచిన పవన్ కల్యాణ్ రియల్ హీరో అంటూ స్థానికులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని