
Bandla Ganesh Donation: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు తన “ఈశ్వరా.. పవనేశ్వరా..” అంటూ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఉన్న వీరభక్తి అందరికీ తెలిసిందే. తనను నిర్మాతగా నిలబెట్టిన ‘గబ్బర్ సింగ్’ సినిమాను ఎప్పటికీ మర్చిపోని బండ్ల గణేష్..
పవన్ కల్యాణ్ రాజకీయ మరియు సామాజిక అడుగుల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరంగల్ (హన్మకొండ) పర్యటనలో పవన్ కల్యాణ్ చూపిన మానవత్వానికి స్పందించిన బండ్ల గణేష్, మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కాళ్లు పనిచేయక, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బాలుడు నిరంజన్ వైద్య ఖర్చుల కోసం బండ్ల గణేష్ తన వంతుగా భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Read Also:Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి! వరంగల్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలోని హనుమాన్ నగర్లో నివసిస్తున్న అనారోగ్య బాధితుడు నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లారు. చాలా కాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలు, రెండు కాళ్లు పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిరంజన్ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
బాధితుడి తల్లిదండ్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం మరియు తన వ్యక్తిగత తరఫున పూర్తి భరోసా కల్పించారు. పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి ఆ బాలుడిని కలిసిన విజువల్స్ చూసి చలించిపోయిన బండ్ల గణేష్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన చేశారు.
“నా ఆరాధ్య దైవం, నా బాస్ పవన్ కల్యాణ్ గారి స్ఫూర్తితో.. మా ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ (Parameswara Art Productions) బ్యానర్ తరఫున బాధితుడు నిరంజన్ వైద్య చికిత్స నిమిత్తం ₹5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను.
పవర్ స్టార్‌ను కలవాలనే ఆ బాలుడి చిరకాల కోరిక నెరవేరడం నా హృదయాన్ని కదిలించింది.” సినీ రంగంలోనే
కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పవన్ కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Seven terrorists arrested : ఢిల్లీలో పాకిస్థాన్ మద్దతు గల ఉగ్రవాద నెట్వర్క్ భగ్నం – ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Arbaaz Khan: కోల్‌కతాలో నటుడు అర్బాజ్ ఖాన్ కారులో గుర్తుతెలియని వ్యక్తి
Sanchita Ugale Suicide Case: సంచితా ఉగలే ఆత్మహత్య వెనుక అసలు రహస్యం? లీకైన వాట్సాప్ చాట్స్!
Ranabali Movie: రణబాలి మూవీలో హాలీవుడ్ స్టార్..ఫస్ట్ లుక్ విడుదల
Samantha Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Sreemukhi Marriage:సమంత స్టేజ్ పై శ్రీముఖి హల్చల్.. ‘మా ఇంటి బంగారం’ హిట్టయితే నా పెళ్లి ఫిక్స్!
Vanda Devullu: ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా హాజరైన నిహారిక కొణిదెల