
Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో రాబోయే ఒక గంటలో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుని, భారీ వర్షం పంజా విసిరే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. వర్ష ప్రభావం క్రమంగా ఇతర జిల్లాలకు విస్తరించనుంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోకి కూడా ఈ భారీ వర్షాలు విస్తరించనున్నాయి. ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Read Also : Bandla Ganesh Donation:పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం!
భారీ వర్షాలు కురిసే జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడనుంది. ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో రాబోయే రెండు గంటల వ్యవధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఈ అకాల భారీ వర్షాలు, ఉరుముల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల క్రింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు.
Bandla Ganesh Donation:పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార
ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో ఇక కార్పొరేట్ చదువులు: సీఎం
Rajanna Sircilla news: పానీపూరి తిని 19 మందికి అస్వస్థత.. స్పందించిన కేటీఆర్!
Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి!
Adilabad Farmer Suicide: పంట అమ్ముడుపోలేదని కొనుగోలు కేంద్రంలోనే పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
Rythu Bharosa release date: రైతు భరోసా నిధులు జూన్ 26 నుంచి విడుదల