
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో వాపులు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పరగడుపున రోజూ కరివేపాకు నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. కరివేపాకులో ఉండే గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కరివేపాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చూపును స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలు, నలుపును తొలగించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కరివేపాకులో ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. Flower Rings: పెళ్లి కూతురు కోసం అదిరిపోయే ఫ్లవర్ రింగ్ డిజైన్లు Silver Earrings: పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్ Mini Mangalsutra: డైలీవేర్కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు