
బ్యాంకుకు ఓ పనిమీద వెళ్తే మరో ప్రొడక్ట్‌ను అంటగట్టడం, లోన్ తీసుకోవాలంటే బీమా పాలసీ తప్పనిసరి అని చెప్పడం, మొబైల్ యాప్ తెరిస్తే వరుసగా లోన్ ఆఫర్లు చూపించడం వంటి పద్ధతులకు త్వరలో చెక్ పడనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆర్బీఐ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది.
బ్యాంకులు అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇప్పటి వరకు బ్యాంకింగ్ రంగంలో తరచూ వినిపించిన ఫిర్యాదుల్లో ‘మిస్ సెల్లింగ్’ ఒకటి. అంటే వినియోగదారుడికి అవసరం లేని ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ను అమ్మడం.
సరైన సమాచారం ఇవ్వకుండా ఒప్పించడం. అనుమతి లేకుండానే పాలసీలు లేదా ఇతర సేవలు జత చేయడం వంటి చర్యలు ఇందులోకి వస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు తొలిసారి స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన ఆర్బీఐ వాటిపై కఠిన వైఖరి అవలంబించింది.కొత్త నిబంధనల ప్రకారం రుణం మంజూరు చేయాలంటే తప్పనిసరిగా బీమా పాలసీ కొనాలని బ్యాంకులు షరతు విధించకూడదు.
గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకునే సమయంలో బీమా అవసరమైతే వినియోగదారుడు తనకు నచ్చిన సంస్థ నుంచి పాలసీ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. బ్యాంకు సూచించిన సంస్థ నుంచే కొనాలంటూ ఒత్తిడి చేయడం నిషేధం.వినియోగదారుడి సమ్మతికి కూడా కొత్త నిర్వచనం తీసుకొచ్చింది ఆర్బీఐ.
ఒక ఉత్పత్తికి ఇచ్చిన అంగీకారాన్ని మరో ప్రొడక్ట్‌ను వర్తింపచేయకూడదు. రుణం తీసుకున్న వ్యక్తికి అదే ఆధారంగా బీమా, పెట్టుబడి పథకాలు లేదా ఇతర ఆఫర్లను పంపడం కుదరదు. ప్రతి ఉత్పత్తికి విడిగా స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందే.డిజిటల్ వేదికల్లో బ్యాంకులు అనుసరిస్తున్న