
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా, సిరీస్‌లో నిలవాలంటే ఆఫ్ఘనిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.ఈ మ్యాచ్‌లో భారత జట్టు యాజమాన్యం మరో యువ ఆటగాడికి అవకాశం కల్పించింది.
యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన మూడో ఆటగాడిగా ప్రిన్స్ నిలిచాడు. తొలి వన్డేలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తమ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
క్వాడ్ సమస్యల కారణంగా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని జట్టు యాజమాన్యం తెలిపింది. ప్రిన్స్ యాదవ్‌తో పాటు యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులోకి వచ్చారు.టాస్ గెలిచిన అనంతరం ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ..
"వికెట్ తాజాగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. గత మ్యాచ్‌లో మేం బాగానే ఆడినా భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. ఒకే ఒక్క భాగస్వామ్యం తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం.
ఈసారి బలంగా పుంజుకుంటామని ఆశిస్తున్నాం. మా కుర్రాళ్లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. జట్టులో మూడు మార్పులు చేశాం. నబీ