
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్-జెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో అల్జీరియాపై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.
గ్రూప్-జెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో అల్జీరియాపై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
అయితే మొదటి గోల్ కొట్టిన సందర్భంలో మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. అందుకు గల కారణానాన్ని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. తాను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని, గోల్ కొట్టిన సంతోషంలో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని తెలిపాడు.
అయితే తన భావోద్వేగంతో మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. మెస్సీ మాట్లాడుతూ..'మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. ఫిఫా ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్ చేస్తానని ఊహించలేదు. మ్యాచ్ సమయంలో నా సహచరులు అండగా నిలిచారు.
సరైన సమయంలో పాస్‌లు అందించి గోల్స్ చేయడంలో వారు నాకు సహకరించారు' అని మెస్సీ అన్నాడు. 'ఈ విజయం నా ఒక్కడిది ఎంతమాత్రం కాదు. జట్టు మొత్తం చేసిన కృషి ఫలితమే ఈ విజయం. తదుపరి మ్యాచ్‌ల్లోనే ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్నాను.
నేను రికార్డుల గురించి పట్టించుకోను. ఇవాళ నేను రికార్డు సృష్టించాను.. కానీ రేపు అన్న రోజు నా రికార్డును వేరేవాళ్లు బద్దలు కొడుతారు. మాకు అన్ని వేళల అండగా నిలుస్తూ వస్తోన్న కోచ్ లియోనల్ స్కలోనికి ధన్యవాదాలు' అని మెస్సీ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్