
ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది. ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది.
అమెరికా తన కీలక సైనిక కమాండ్ అయిన 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరును మార్చింది. 'ఇండో'ను తొలగించి 'యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ కమాండ్' అని నామకరణం చేసింది (Indo-Pacific Command). ఈ సైనిక కమాండ్ ఎక్కడెక్కడ పని చేస్తుందో తెలుపుతూ తమ వెబ్సైట్లో అమెరికా రక్షణ శాఖ ఓ మ్యాప్‌ను ఉంచింది.
ఆ మ్యాప్‌లో 'పాక్ ఆక్రమిత కశ్మీర్'ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. కాగా, సైనిక కమాండ్ పేరు మార్పు కేవలం చారిత్రక వారసత్వాన్ని (legacy) పునరుద్ధరించడానికేనని, కమాండ్ బాధ్యతలు, వ్యూహాత్మక లక్ష్యాలు లేదా కార్యకలాపాల్లో ఎలాంటి మార్పూ ఉండదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది (India US defence ties).
1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రుమ్యాన్ యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు (Pacific Command rename). అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలుగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. అయితే ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత 2018లో దీని పేరును 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్'గా మార్చారు.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అమెరికా యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు.. సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే
..