
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Peddi Collections:తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడుతూ, పర్సంటేజ్ విధానాన్ని నిర్మాతలు వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యజమానులందరికీ న్యాయం జరిగేలా శాతం నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు.
రెంటల్ విధానంలో ఒక థియేటర్‌కు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పర్సంటేజ్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అధిక లాభాల కోసం అసమంజసమైన డిమాండ్లు చేయడం సరైంది కాదన్నారు. సినిమా నష్టపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారని, వారి సమస్యలను కూడా గుర్తించాలని కోరారు.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు కీలక పాత్రలో ఉన్నారని నట్టి కుమార్ తెలిపారు. వ్యక్తిగతంగా వారిద్దరితో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, వారు లీజ్ థియేటర్లకు సంబంధించినవారిగా ఉండటం వల్ల ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అందుకే కమిటీకి తటస్థంగా వ్యవహరించే వ్యక్తులు అవసరమని చెప్పారు. సురేష్ బాబు, దిల్ రాజు స్థానంలో కె.ఎల్. నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి వంటి వారిని నియమించాలని సూచించారు. ఇలా చేస్తే కమిటీ తీసుకునే నిర్ణయాలపై అందరికీ నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
సినిమా కలెక్షన్లపై వస్తున్న ప్రచారాల గురించి కూడా నట్టి కుమార్ స్పందించారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, కలెక్షన్లు తగ్గిపోయాయనే వార్తల్లో నిజం లేదన్నారు.
పెద్ద సినిమాలు కొంతకాలంగా లేకపోవడంతో థియేటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి సమయంలో ‘పెద్ది’ సినిమా ఎగ్జిబిటర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. రామ్ చరణ్ తన పాత్ర కోసం ఎంతో కష్టపడి నటించారని, ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారని నట్టి కుమార్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
అదే సమావేశంలో ‘పెద్ది’