
Arutla TPS Opening: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ విద్యా విప్లవ ప్రారంభోత్సవ వేడుకలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సీఎం రేవంత్ రెడ్డి గారి ముందుచూపును ప్రత్యేకంగా ప్రశంసించారు. Read Also : Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి!
రాష్ట్రంలోని కొత్త తరానికి సరికొత్త , అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యకు అత్యంత పెద్దపీట ఇవ్వాలని, కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను సరికొత్తగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అని మంత్రి తెలిపారు.
ఆ దిశగానే ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రూపంలో తొలి అడుగు పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వసతుల ఆధునీకరణపై ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల’ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఆయన వెల్లడించారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభమైన ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ కూడా ఇదే స్పూర్తితో అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు, ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పైసా ఖర్చు లేకుండా ‘అత్యుత్తమ విద్య, వైద్యం’ అందించాలనే బలమైన నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారని మంత్రి కొనియాడారు.
భారం తల్లిదండ్రులకు తప్పుతుందని, భవిష్యత్తులో తెలంగాణ విద్యార్థులు గ్లోబల్ లీడర్లుగా ఎదిగేందుకు ఈ స్కూళ్లు ఒక ఫౌండేషన్లా మారుతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
NEET-UG 2026: నీట్ అభ్యర్థులకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు ఉచిత ప్రయాణ సదుపాయం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Cheyutha Pension Scheme: : పెన్షన్ తీసుకుంటున్నవారికి ALERT
Cockroach Party : ‘కాక్రోచ్ పార్టీ’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
Telangana Rythu Bharosa 2026: ఇక 5 ఎకరాలు దాటినా కూడా రైతు భరోసా? 18న క్లారిటీ
NEET-UG 2026: NEET పునఃపరీక్ష ‘సైనికీకరణ’పై అన్నామలై, బీజేపీల మధ్య వాగ్వాదం
Silver imports India: 87% పడిపోయిన వెండి దిగుమతులు!
ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు పెంచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే