
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ (India) అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ అలాంటి దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బీజేపీ (BJP)కి తొత్తుగా మారిందని ఆరోపించారు.
2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కానీ ప్రస్తుతం వారికి ఓట్లు పడవనుకుంటే వాటిని తొలగిస్తుందన్నారు. మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఎస్ఐఆర్ పేరుతో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని వివరించారు.
తమ ఓట్లు క్షేమంగా ఉండాలంటే బీఎల్ఏ కీలకంగా పని చేయాల్సి ఉందని చెప్పారు. నిరంతరం అధికారంలో ఉండి చక్రవర్తుల్లా ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మీ కంటే పెద్ద చక్రవర్తులే నేలమట్టం అయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎంత?
అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అనుకుంటే, వారు మూర్ఖులే అవుతారన్నారు. దేవుళ్లకు ఎవరు వ్యతిరేకం కాదని, కానీ దేవుడి పేరు చెప్పనిదే బీజేపీ వాళ్లకు ఓట్లు పడవన్నారు
.