
రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలు.. వాటి పైన నివేదికల ఆధారం గా భవనాలను మరోసారి పరిశీలించి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దం అవుతోంది.
దీంతో, వచ్చే కేబినెట్ లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.రుషికొండ భవనాల వినియోగం పైన సిఫారసులు చేసేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు విశాఖలో సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లో కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్నారు.
ఇప్పటికే పలు రకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఆతిధ్య రంగానికి ఇవ్వాలనే అంశం పైన కసరత్తు జరిగింది. కాగా, ఆతిథ్య రంగానికి ఆ భవానాలు అనువుగా లేవని తేల్చిన అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ స్పష్టం చేసింది. భవనాల్లో చాలా మార్పులు లేదా మరికొన్ని నిర్మాణాలు కి అనుమతులు ఇవ్వాలని సంస్థ లు కోరుతున్న వేళ...
సబ్ కమిటీ అధికారుల నుంచి అభిప్రాయాలు కోరింది. దీంతో చివరిగా విశాఖలో మరోసారి భేటీ కానున్న మంత్రి వర్గ ఉపసంఘం ఫైనల్ గా భవనాల వినియోగం పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం.రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!కీలక భేటీ..
తుది నివేదికఈ భేటీ తరువాత సబ్ కమిటీ లోని మంత్రులు తమ నివేదికతో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. విశాఖపట్నంలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.453 కోట్లతో పర్యాటక శాఖ ఆప్యాలెస్ను నిర్మించింది. వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని సీఎం చంద్రబాబును కోరారు.
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం ఏపీటీడీసీ కూడా టెండర్లను ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ
రుషికొండ భవానల వినియోగం పై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. విశాఖ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సబ్ కమిటీ సభ్యులు ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలు.. వాటి పైన నివేదికల ఆధారం గా భవనాలను మరోసారి పరిశీలించి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దం అవుతోంది. దీంతో, వచ్చే కేబినెట్ లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.రుషికొండ భవనాల వినియోగం పైన సిఫారసులు చేసేందుకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు విశాఖలో సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లో కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే పలు రకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఆతిధ్య రంగానికి ఇవ్వాలనే అంశం పైన కసరత్తు జరిగింది. కాగా, ఆతిథ్య రంగానికి ఆ భవానాలు అనువుగా లేవని తేల్చిన అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ స్పష్టం చేసింది. భవనాల్లో చాలా మార్పులు లేదా మరికొన్ని నిర్మాణాలు కి అనుమతులు ఇవ్వాలని సంస్థ లు కోరుతున్న వేళ... సబ్ కమిటీ అధికారుల నుంచి అభిప్రాయాలు కోరింది. దీంతో చివరిగా విశాఖలో మరోసారి భేటీ కానున్న మంత్రి వర్గ ఉపసంఘం ఫైనల్ గా భవనాల వినియోగం పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని సమాచారం.రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!కీలక భేటీ.. తుది నివేదికఈ భేటీ తరువాత సబ్ కమిటీ లోని మంత్రులు తమ నివేదికతో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. విశాఖపట్నంలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.453 కోట్లతో పర్యాటక శాఖ ఆప్యాలెస్‌ను నిర్మించింది. వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని సీఎం చంద్రబాబును కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం ఏపీటీడీసీ కూడా టెండర్లను ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో పెద్ద పెద్ద సంస్థలే ముందుకువచ్చాయి. తాజ్‌ గ్రూపు, విశాఖలో కొండపై బేపార్క్‌ నిర్వహిస్తున్న ఫెమా గ్రూపు, అట్మాస్పియర్‌ కోర్‌ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్యాలెస్‌ ముందు తొమ్మిది ఎకరాలు ఇస్తామని ఏపీటీడీసీ ప్రకటించగా, అందులో ఏడు ఎకరాలు కోస్తా నియంత్రణ జోన్‌ (సీఆర్‌జెడ్‌) పరిధిలో ఉందని తేల్చారు. దీంతో.. మార్పులకు సంబంధించి సాధ్యా సాధ్యాలను సబ్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కీలకంగా మారనుంది.