
మాజీ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్, ప్రస్తుత ఇరాక్ ఫుట్‌బాల్ స్టార్ జిదాన్ ఇక్బాల్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. అయితే గ్రౌండ్లోకి దిగకముందే అతను ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో జిదాన్ ఇక్బాల్ తన బూట్లపై పాకిస్తాన్ జెండాను ముద్రించుకుని ఆడబోతున్నాడు.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బూట్లపై ఒక దేశ జెండాను పెట్టుకోవడం ఆ దేశాన్ని అవమానించడమే అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇరాక్ టీమ్ తరఫున జిదాన్ ఇక్బాల్ మైదానంలోకి అడుగు పెట్టగానే వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు నమోదు కానుంది.
బూట్లపై జెండా వివాదం ఎలా ఉన్నా, ఈ మూమెంట్ ఇరాక్ కంటే కూడా పాకిస్తాన్ అభిమానులకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే 240 మిలియన్ల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న పాకిస్తాన్.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద దేశం. కానీ ఆ దేశ ఫుట్‌బాల్ టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాలేదు.
తన హిస్టరీలోనే పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో 198వ ప్లేస్‌లో ఉంటూ ఫుట్‌బాల్‌లో అత్యంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న దేశాల లిస్ట్‌లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీ నుండి వచ్చిన జిదాన్ ఇక్బాల్ ప్రస్తుతం 'ఎఫ్‌సి యుట్రెచ్ట్' క్లబ్ కోసం ఆడుతున్నాడు.
ఇంటర్నేషనల్ లెవెల్లో అతను ఇరాక్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడుతున్న పాకిస్తానీ మూలాలున్న మొదటి ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. అందుకే అతను తన రెండు వారసత్వాలను గౌరవిస్తూ.. ఒక బూటుపై ఇరాక్ జెండాను, మరొక బూటుపై పాకిస్తాన్ జెండాను వేసుకుంటున్నాడు.
చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. "నిజం చెప్పాలంటే నాకు ఈ రికార్డ్ గురించి అస్సలు తెలియదు. నేను సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూడగానే వెంటనే మా నాన్నకు మెసేజ్ చేశాను. మేమిద్దరం చాలా షాక్ అయ్యాం" అని బీబీసీ స్పోర్ట్స్‌తో అన్నాడు. తనకున్న పాకిస్తానీ మూలాల పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, తన కెరీర్లో తన తండ్రే తనకు బిగ్గెస్ట్ గైడ్ అని జిదాన్ చెప్పుకొచ్చాడు.
ఈ టాలెంటెడ్ మిడ్‌ఫీల్డర్‌కు తన రెండు దేశాల వారసత్వాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ డబుల్ ఐడెంటిటీని అతను తన బూట్ల ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నాడు. తన ఎడమ కాలి బూటుపై ఇరాక్ జెండాను, కుడి కాలి బూటుపై పాకిస్తాన్ జెండాను ధరిస్తున్నాడు. తన దృష్టిలో రెండు దేశాలు సమానమేనని, తన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నానని జిదాన్ చెప్పాడు.
"నేను ఇంకా చాలా చిన్నవాడిని, కానీ వరల్డ్ కప్ ఆడుతున్న మొదటి పాకిస్తానీ ప్లేయర్‌ని నేనే కాబోతున్నాను. ఫుట్‌బాల్ ప్లేయర్స్ కావాలని కలలు కనే పిల్లలు నన్ను చూసి.. తాము కూడా సాధించగలమని నమ్ముతారని ఆశిస్తున్నాను" అని అన్నాడు. సౌత్ ఏషియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఏ కిడ్ అయినా సరే.. హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినా సక్సెస్ సాధించవచ్చని జిదాన్ మెసేజ్ ఇచ్చాడు.
ఈ రేర్ రికార్డ్ గురించి జిదాన్ ఇక్బాల్ మాట్లాడుతూ.. తనకు ఈ విషయం తెలిసి