
తెలంగాణ గురుకుల పాఠశాలల టెండర్లలో ఏకంగా రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సంక్షేమ శాఖల్లో మొత్తం టెండర్ల విలువే రూ.2 వేల కోట్లు లేనప్పుడు, అంత మొత్తంలో స్కాం జరిగిందని ఎలా అంటారు? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాఖలపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, వాటిని నిరూపిస్తే ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బలహీన వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, అలాంటి వర్గాలను మాటలతో కించపరచే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే లక్ష్యంతోనే SIR ప్రక్రియను తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో