
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు తగ్గింది. సిల్వర్ రేటు సైతం తగ్గుముఖం పట్టింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,325 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,51,100 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,250 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,060కు చేరగా..
22క్యారట్ల బంగారం రూ.1,40,300 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,75,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా..
చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు చేరింది. గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
.