
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Visakhapatnam woman Suspicious death in mussoorie: ఎంతో సంతోషంగా విశాఖపట్టణానికి చెందిన ఓ యువజంట ఉత్తరాఖండ్‌లోని ముస్సోరికి హనీమూన్‌కు వెళ్లారు. అక్కడ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని పి.
రాధా గాయత్రిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. ఈ జంట ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. విశాఖలోని చినముషిడివాడకు చెందిన రాధా గాయత్రికి.. గతేడాది నవంబర్ 8న సౌమ్య శ్రీచరణ్‌తో వివాహం జరిగింది.
విశాఖపట్టణానికి చెందిన వీరు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా వర్క్ చేస్తున్నారు. గాయత్రి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తుండగా.. సౌమ్య శ్రీచరణ్ పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గాయత్రి తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి హనీమూన్ కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేష్‌కు చేరుకున్న దంపతులు.. జూన్ 14న అర్ధరాత్రి తరువాత ముస్సోరీ సమీపంలోని ట్రిపిధార్ ప్రాంతంలో ఉన్న ఓ హోమ్‌స్టేలో రాత్రి 11.30 గంటలకు చెకిన్ అయ్యారు.
భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం భర్త శ్రీచరణ్ నిద్ర లేచేసరికి భార్య గాయత్రి దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది.
అంతేకాకుండా ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని సదరు భర్త తెలిపాడు. రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు
. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. బెడ్‌షీట్‌పై రక్తం మరకలు, గదిలో రెండు మద్యం బాటిళ్లు, ఆహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. వైద్యుల బృందం పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను కెమెరాలో రికార్డ్ చేయాలని పోలీసులు కోరారు. గాయత్రి మృతి ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ముస్సోరికి బయల్దేరి వెళ్లారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.