
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Business Ideas: నేటికాలంలో చాలా మంది రైతులు టెక్నాలజీతో పోటీ పడి మరీ పంటలు పండిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు యువత కూడా ఉద్యోగాలకు స్వస్తి పలికి వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు. తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు పండిస్తూ కోటీశ్వరులు అవుతున్నారు.
ఒకప్పుడు పంటలు పండించాలంటే ఎకరాల కొద్దీ భూమి ఉంటేనే సాధ్యం అవుతుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా సరే అందులో బంగారం పండిస్తున్నారు. మీరు కూడా వ్యవసాయం చేయాలనుకుంటే మీకు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
అయితే ఇప్పుడు మీ జీవితాన్నే మార్చే ఒక పంట గురించి చెబుతాము. ఈ పంటతో మీరు తక్కువ కాలంలోనే భారీ ఆదాయం పొందవచ్చు. ఆ పంట ఏదో చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు గురించి తెలియని వారుండరు. డ్రాగన్ ఫ్రూట్ తింటే డాక్టర్ తో పనిలేదని కూడా చెబుతుంటారు.
మార్కెట్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ ధర 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పలుకుతోంది. మరి ఈ పంట పండించాలంటే ఎకరాల కొద్ది పొలం ఉండాలా అంటే అవసరమే లేదు. కేవలం 10 గుంటల పొలం ఉన్నా సరిపోతోంది. ఎందుకంటే ఈ పండుకు దేశీయంగానే కాదు విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ పెరిగింది.
తక్కువ సమయంలోనే భారీగా లభాలు అందిస్తుండటంతోపాటు.. ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో కార్బోహైడ్రేట్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే డాక్టర్లు కూడా రోగులకు దీన్ని సిఫార్సు చేస్తుంటారు. అందుకే ఈ పండుకు భారీగా డిమాండ్ పెరిగింది.
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే మాత్రమే దీన్ని సాగుతున్నారు. అందులో
మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. మీరు కూడా ఈ పంటను సాగు చేయాలనుకుంటే ఎలా పండించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసేందుకు ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండక్కర్లేదు. అధిక నీరు, వర్షాపాతం అస్సలు అవసరం లేదు. బంజరు భూముల్లోనూ ఈ పంటను పండించవచ్చు. ఈ మొక్కలను ఎండ ఎక్కువ అవసరం లేదు. చెట్లు నీడకు ఉన్నా పెరుగుతాయి. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉత్తర భారత దేశంలో రైతులు ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగును చేస్తున్నారు.
అయితే ఈ పంటను సాగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక రాయితీలను అందిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం రాయితీలు అందించి, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. ఎకరాకు రూ. 1,20,000 రాయితీని అందిస్తోంది. ఒక రైతు 10 ఎకరాలకు రాయితీని పొందుతారు. ఇందులో పందిళ్ల వ్యవస్థకు ఎకరాకు రూ. 70,000, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటడానికి రూ. 50,000 కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వమే కాదు బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించేందుకు రైతులకు 40శాతం రాయితీని అందిస్తోంది.
మీరు ఒక 10గుంటల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని ప్లాన్ చేస్తే, సంవత్సరానికి రూ. 8-10 లక్షలు సులభంగా సంపాదించవచ్చు. మీ అంచనా ఆదాయం మీరు సాగు చేసే భూమి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ సాగుకు ప్రారంభ పెట్టుబడి రూ. 4-5 లక్షలు ఉండవచ్చు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 8-10 లక్షల ఆదాయం పొందవచ్చు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.