శ్రీవల్లి కడుపుబాగోతాన్ని బయటపెట్టడంలో భాగంగా.. ఆమెను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు నర్మద, ప్రేమలు. ఈరోజు (జూన్ 17) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. రామరాజు వసూళ్ల కోసం బయటకు వెళ్తుంటే..
కారుతో నేను డ్రాప్ చేస్తా రా నాన్నా అంటూ కారు ఎక్కించుకుంటాడు ధీరజ్. నువ్వు బైక్ వేసుకుని వెనకొచ్చేయ్ మామా అని చెప్తాడు ధీరజ్. సరిగ్గా కారు తీసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా ఫైనాన్షియర్ వస్తాడు. నమస్తే అన్నా.. ఏంటన్నా ఇలా వచ్చారూ అని అడుగుతాడు ధీరజ్.
‘హా కారు తీసుకుని వెళ్దాం అనీ’ అంటూ షాక్ ఇస్తాడు ఫైనాన్షియర్. కారు తీసుకుని వెళ్లడం ఏంటి? నేనేం ఈఎంఐలు కట్టడం ఆలస్యం చేయలేదు కదా.. అసలు ఈఎంఐ డేట్ రాలేదు కదా అని అడుగుతాడు ధీరజ్. పోలీస్ కేసు అయ్యింది కదా.. కేసు పడితే అగ్రిమెంట్ ప్రకారం కారు తీసుకుని వెళ్లిపోతానని చెప్పాను కదా అని అంటాడు ఫైనాన్షియర్.
అది తప్పుడు కేసు అన్నా అని అంటాడు ధీరజ్. ఇంతలో రామరాజు కారు దిగి.. ‘మా వాడు చెప్తున్నది నిజమే.. వాడిపై తప్పుడు కేసు పెట్టారు.. అందుకే ఆ కేసులో వాడ్ని పోలీసులు వదిలేశారు. ఆ కేసుకి సంబంధించి ఎలా ఇష్యూ ఉండదు’ అని అంటాడు.నన్ను నమ్మండి అన్నా..
ప్లీజ్!! నమ్మకం లేదూ గిమ్మకం లేదూ తప్పుకో ఆ మాటతో ఫైనాన్షియర్ ‘ఒక్కసారి కేసు అయితే పోలీసులు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. విచారణ పేరుతో నీతో పాటు కారుని కూడా తీసుకుని రమ్మంటారు. కారుని సీజ్ కూడా చేయొచ్చు. అప్పుడు నష్టపోయేది నేనూ..
నీకు కారు కావాలంటే మొత్తం డబ్బులు కట్టి కారు తీసుకుని వెళ్లు’ అని మెలిక పెడతాడు ఫైనాన్షియర్. దాంతో ధీరజ్.. ‘అన్నా ప్లీజ్ అన్నా.. నా దగ్గర అంత డబ్బు లేదు.. ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను.. నన్ను నమ్మండి’
అని ప్రాధేయపడతాడు. నమ్మకం లేదూ.. గిమ్మకం లేదూ.. తప్పకో అంటూ దౌర్జన్యం చేయబోతాడు ఫైనాన్షియర్. అయ్యయ్యో కారు ఎత్తుకెళ్లిపోయారే.. సరిగ్గా అప్పుడే.. ఏరా రామరాజూ అంటూ ఎంట్రీ ఇస్తుంది భద్రావతి. ‘‘ఏదో సొంతకారులా లోపల దర్జాగా కూర్చున్నావ్ ఏంట్రా రామరాజూ.. వీడి మొహానికి డౌన్ పేమెంట్కే దిక్కులేదు.. వీడు ఒకేసారి డబ్బు కడతాడా? వాడికంత సీన్ లేదు కానీ.. మీరు కారు తీసుకుని వెళ్లండీ అని అంటుంది. దాంతో ఆ ఫైనాన్షియర్ ధీరజ్ని పక్కకి నెట్టేసి కారుని తీసుకుని వెళ్లిపోతారు. రామరాజుతో పాటు ధీరజ్, ప్రేమలు తెల్లమొహం వేస్తారు. భద్రావతి, సేనాపతిలు హేళనగా నవ్వుతూ.. ‘ఏరా పిల్లకాయ్.. పొగరు దిగిందా? మొన్న ఉరిమురిమి చూశావ్ కదరా.. మరి ఇప్పుడేంటిరా. ఆ కళ్లు దీనంగా నేల చూపులు చూస్తున్నాయ్. కుందేలు ఎప్పుడూ పులికి ఎదురు రాకూడదు.. అర్థమైందా? అని వార్నింగ్ ఇస్తుంది భద్రావతి. చచ్చిన పాముని చంపను.. ఏంటీ అర్థమయ్యేదీ.. అంటూ జూలు విదుల్చుతుంది ప్రేమ. ఇన్నాళ్లూ మేనత్తా.. కన్నతండ్రీ అనే మమకారంతో వీళ్లు ఏం చేసినా భరిస్తూ వచ్చాను. కానీ రోజు రోజుకీ వీళ్ల అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాళ్లని ఇలా వదిలిపెట్టకూడదు’ అంటూ వాళ్ల మీదికి తీసుకుని వెళ్తుంది. ఇంతలో ధీరజ్ అడ్డుకుని.. ‘తప్పు ప్రేమా.. జంతువుల్ని కొట్ట కూడదు. జీవహింస మహాపాపం అని అంటాడు. ఏంట్రా వాగుతున్నావ్ అని భద్రావతి అంటే.. ‘నువ్వే కదా భద్రం పులి గిలీ అన్నావ్.. మరి పులి అంటే జంతువే కదా’ అని అంటాడు ధీరజ్. ఏయ్ అని సేనాపతి దూసుకుని వచ్చేసరికి.. ఆల్రెడీ చేయి విరిగిందీ.. చచ్చిన పాముని చంపే రకం కాదు నేను’ అని అంటాడు ధీరజ్. ఇదీ నా పొగరు.. నా నుంచి లాక్కునేది బొంగూ, బోడీ రేయ్.. ఇంత జరిగినా నీ పొగరు మాత్రం తగ్గలేదురా అని అంటుంది భద్రావతి. ‘తగ్గదూ.. అది మా నాన్న పంచిన రక్తంలో ఉన్న పొగరు. పోయింది కారే.. కాన్ఫిడెన్స్ కాదు. మీరు కారు తీసుకుని వెళ్లేలా చేయగలరు. కానీ మా నాన్న నాకు ఇచ్చిన ధైర్యాన్ని కోల్పేయేలా చేయలేరు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మా నాన్న ధైర్యాన్ని చిరునవ్వుని లాక్కోలేకపోయారు.. ఇక నన్నేం చేయగలరు బొంగూ, బోడి.. ఏమంటారు నాన్నా’ అని అంటాడు ధీరజ్. దాంతో రామరాజు వచ్చి.. ధీరజ్ భుజంపై చేయి వస్తాడు. దాంతో ధీరజ్ మరింత రెచ్చిపోతాడు. ‘ఈ భరోసా చాలు.. మీలాంటి వాళ్లనే కాదు.. ఈలోకాన్నే గెలవగలను’ అంటూ శపథం చేస్తాడు ధీరజ్. నీ మేనకోడలికి నా కొడుకు జీవితాన్నిచ్చాడు.. కన్నతల్లిగా కడుపుకోతతో అంటున్నా మీరు నన్ను రోడ్డుపైకి లాక్కొచ్చామని తెగ గాల్లో తేలిపోతున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీరు ఎంత వెనక్కి లాగాలనిచూస్తే నేను అంత ముందుకు వెళ్తాను అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్తాడు ధీరజ్. ఇక భద్రావతి, సేనాపతి వైపు కోపంగా చూసిన వేదవతి.. ‘నీ కూతురుకి, నీ మేనకోడలికి నా కొడుకు జీవితాన్ని ఇచ్చాడు. కానీ మీరు మాత్రం.. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనే చూస్తున్నారు.. తోడ పుట్టిన వాళ్లనే బంధానికి తలవంచాను తప్ప.. నేను ఇప్పుడూ ఇలా మాట్లాడలేదు. కానీ మీరు నా కొడుకు జీవితంతో ఆడుకోవడం చూసి తట్టుకోలేక.. కన్నతల్లిగా కడుపుకోతతో అంటున్నా.. మీరు బాగుపడరు.. అని శాపనార్థాలు పెడుతుంది వేదవతి.కారు పోయి డాండాండాం.. ఇది కూడా పాయే డాండాండాం.. ఓసి నీ శాడిజం తగలెయ్యా ఇంట్లో ఎవరైనా ఏడిస్తే.. ఆనందపడటం, శాడిజం చూపించడం శ్రీవల్లికి అలవాటు కాబట్టి.. కారుపోయిందన్న బాధలో ఉన్న ప్రేమ దగ్గరకు వచ్చి వాయింపు స్టార్ట్ చేస్తుంది. కారు బొమ్మని తీసుకుని వచ్చి ప్రేమకి ఎదురుగా వెళ్లి.. ఆ కారుని కింద పెట్టి దొర్లిస్తూ.. ‘కారుపోయి కాళ్లు వచ్చే డాం డాం డాం.. ట్రావెల్స్ పోయి డెలివరీ బాయ్ వచ్చే డాండాండాం.. ఇది కూడా పోతే ఏమౌతుందో డాండాండాం అంటూ సుకన్యతో కలిసి స్టెప్లు వేస్తుంది శ్రీవల్లి. సుక్కూని వంకపెట్టి.. ప్రేమపై సెటైర్లు వేస్తుంది. ‘ఒసేయ్ సుక్కూ.. నీ పని నువ్వు చూసుకోకుండా.. నా విషయంలో వేలు పెడితే కుట్టకుండా ఉంటానా? ఏయ్ బల్లీ.. నీకు ఉందే ముహూర్తం పెట్టేశా కాలుదువ్వి వాళ్ల మీదికి కయ్యానికి వెళ్లడం ఎందుకో.. ఇప్పుడు కారు పోగొట్టుకుని ఇలా ఏడ్వడం ఎందుకో.. అని మాటతో పొడిచేస్తుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ.. ‘ఏయ్ బల్లీ.. ఆపవే’ అంటూ మీదికి దూసుకుని వచ్చి చేయి లేపుతుంది. ఏయ్ అని భయపడిపోతుంది శ్రీవల్లి. అప్పుడు ప్రేమ పెద్దగా నవ్వుతూ.. ‘భయపడ్డావా అక్కాయ్.. మా బల్లికి సాయంత్రం కచేరీ ఉందంటా డాండాండాం.. దీనికి కచేరి పెట్టి చాలారోజులైందంట డాండాండాం.. ఈసారి కచేరి చాలా కొత్తగా ఉంటుందంట డాండాండాం.. సాయంత్రం కచేరిలో కలుద్దాం.. ఫుల్గా రెడీ అయిపో’ అంటూ డాన్స్ చేస్తూ శ్రీవల్లికి ఇచ్చిపడేస్తుంది ప్రేమ. ఏంటే అలా భయపడి చేస్తున్నావ్.. లేపి తన్నించుకోవడం అంటే ఇదే ఇక కచేరీ అనగానే వణికిపోతుంది శ్రీవల్లి. ఏంటే.. కచేరీ అంటే అంత వణికిపోతున్నావ్ అని సుకన్య అంటే.. ‘కచేరీ అంటే అది మామూలు కచేరా కాదు.. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. తెల్లార్లూ ఒక్కటే మ్యూజిక్.. భరించలేను బాబోయ్ అని హడలి చస్తుంది శ్రీవల్లి. నీకు నోరు కాదు.. ఒళ్లు కూడా మహాదురద.. ప్రేమ ఏడుస్తుంటే చూసి ఆనందించకుండా ఇంకా ఏడిపించాలని కెలికావ్.. కెలికి కదిలించి మరీ కచేరీ పెట్టించుకున్నావ్.. అనుభవించు అని అంటుంది. ఈ రాత్రికి కచేరీ ఎలా డిజైనింగ్ చేశారో ఏంటో అంటూ ఏడుపు మొదలుపెడుతుంది శ్రీవల్లి. లేపి తన్నించుకోవడం అంటే ఇదేమరి. 🔹‘కార్తీకదీపం’ జూన్ 17 ఎపిసోడ్: జోత్స్నతో సూరజ్ డీల్.. ‘నాతో కలిస్తే నువ్వే సీఈవో’.. జో పాపకి రక్తకన్నీరు