
TTD Sets Record In Luggage Dposit Services In April–May 2026: తిరుమలలో భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలకు దేశం నలుమూలల నుండి శ్రీవారి భక్తులు వస్తుంటారు. వారికి టీటీడీ సరైన వసతులు కల్పిస్తోంది.
ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో టీటీడీ భక్తులకు లగేజీ డెలివరీ సేవలను అందించింది. ఇందులో భాగంగా ఒక కోటి మందికి పైగా భక్తులకు లగేజీని అందజేసింది. తిరుమలలో భక్తుల లగేజీ భద్రత కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్ల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి తగిన సదుపాయాలు కల్పిస్తోంది టీటీడీ. కాలినడక యాత్ర చేసే భక్తులు తమతో తెచ్చుకునే బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రపరుచుకోవడానికి కాలినడక మార్గంలో మొత్తం 65 కౌంటర్లను ఏర్పాటు చేసింది.
దీనివల్ల ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో 51,38,97 మంది భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేశారు. తిరుమలలో గత మూడు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ మూడు రోజుల్లోనే 3,41,742 మంది భక్తులు ఉచిత లగేజీ సేవలను వినియోగించుకున్నారు.
అలిపిరి కాలినడక మార్గంలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి షిఫ్ట్‌లో 15 మంది చొప్పున మొత్తం 45 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక్కడ లగేజీ డిపాజిట్ సామర్థ్యం 10,194 గా ఉంది. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తిరుమలలోని ప్రధాన డిపాజిట్ కేంద్రాల విషయానికి వస్తే.. ఫ్రీ హాల్లో 8 కౌంటర్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో రెండు కౌంటర్లు, నారాయణగిరి షెడ్డులో ఐదు కౌంటర్లు, డిడి హాల్లో మూడు కౌంటర్లు, రూ.300 టికెట్ హాల్ వద్ద నాలుగు కౌంటర్లు, కాంప్లెక్స్ అప్ స్కేలింగ్ వద్ద రెండు కౌంటర్లు ఉన్నాయి.
సమర్పించే కళ్యాణకట్ట వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల దర్శనం కోసం PHC వద్ద ఒక కౌంటర్, శుభదం వద్ద ఒక కౌంటర్, VQC మెయిన్ గేట్ , శ్రీనివాసి ట్రస్ట్ వద్ద ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు.
టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ వస్తువులను అప్పగించిన తర్వాత, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ కోడ్‌ను బ్యాగుకు స్టిక్కర్‌గా అంటించి, భక్తులకు ఒక స్లిప్‌ను అందజేస్తారు. డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి తీసుకునే సమయంలో, ఆ స్లిప్‌ను సిబ్బందికి చూపించి మాత్రమే తిరిగి పొందాల్సి ఉంటుంది.
వీటితో పాటు తల నీలాలు