
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్‌రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఐఆర్ఎఫ్సీ రుణం త్వరగా వచ్చేలా చూడాలని కిషన్‌రెడ్డిని కోరారు. ‘‘సమస్య పరిష్కారానికి ఏ మీటింగ్‌కైనా నేను ఎప్పుడూ సిద్ధమే. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వీలైనంత త్వరగా భేటీ ఏర్పాటు చేయించాలి. ఆ సమావేశానికి సంబంధించి మీ కాల్ కోసం ఎదురు చూస్తాను.
అన్ని పత్రాలతో వచ్చి స్పష్టత ఇస్తా. ఈ అంశంలో మీతో వ్యక్తిగత భేటీకి కూడా సిద్ధమే. ఎక్కడికైనా, ఎప్పుడైనా డాక్యుమెంట్లు, అధికారులతో వస్తాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. అంతకుముందు బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్టు అంశాలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో అనంతగిరి వద్ద స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. అక్కడి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. హైదరాబాద్-బెంగళూరు రైల్వేమార్గంలో ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలి.
మన్ననూర్ వద్ద నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ప్లాన్ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే లైన్ ఉండాలన్నారు. కాకతీయ సామ్రాజ్యం, వారసత్వ సంపద ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్‌పోర్టు ఉండాడని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఎయిర్‌పోర్టు ముందు రుద్రమదేవి, రుద్రదేవుడు, నంది విగ్రహంతో ఐలాండ్ ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టు డిజైన్లపై దిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ మూసాపేటలో అగ్నిప్రమాదం జరిగింది.
కాంట్రాక్టర్లు ఈనెల 18న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఆందోళనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా