
చిన్న కాంట్రాక్టర్లకు ఈ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను దశలవారీగా పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్, జూన్16: చిన్న కాంట్రాక్టర్లకు ఈ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
పెండింగ్ బిల్లులను దశలవారీగా పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ గ్రీన్‌లాండ్స్‌లోని ప్రజాభవన్‌లో భట్టితో బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. చిన్న కాంట్రాక్టర్ల సమస్యలపై మానవీయ కోణంలో స్పందిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు.
చిన్న కాంట్రాక్టర్ల బకాయిల క్లియరెన్స్‌కు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రతినెలా నిరంతరాయంగా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డికి బిల్డర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి హామీతో జూన్ 18వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా బిల్డర్ అసోసియేషన్ ప్రకటించింది.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఆరంభం మాత్రమే: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News