
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి.
సదస్సులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. బుధవారం ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు. అంతకుముందు జీ7 సదస్సు వేదిక వద్ద మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్వాగతం పలికారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.