
దిల్లీ: తాము రేవంత్‌రెడ్డికి జవాబుదారీ కాదని, తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవన్నారు.
దేశవ్యాప్తంగా మెట్రోల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. గతంలో కేసీఆర్ సహకరించకపోయినా ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అనాలోచితంగా, దుందుడుకుగా సీఎం మాట్లాడటం సమంజసం కాదన్నారు.
నేను వద్దంటే ప్రాజెక్టులు ఆగవు: కిషన్‌రెడ్డి
|