సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా నగదు, గిఫ్టులు పొందితే కచ్చితంగా కట్టాలి. చట్టం ప్రకారం సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌ను ఒక ప్రొఫెషన్ లేదా బిజినెస్‌గా పరిగణిస్తారు. బ్రాండ్ల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హెడ్ కింద చూస్తారు.
మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకోకుండా కేవలం బార్డర్ కొలాబరేషన్ (వస్తువుకు బదులు ప్రమోషన్) చేస్తారు. అంటే ఫోన్, మేకప్ కిట్ లేదా రిసార్ట్ స్టే వంటివి ఉచితంగా పొంది వాటిని ప్రమోట్ చేస్తారు.
ఇక్కడే ఐటీ శాఖ ఒక కఠినమైన రూల్ పెట్టింది. బ్రాండ్ ఇచ్చిన వస్తువు లేదా సేవ అసలు మార్కెట్ ధర ఎంతో అంత మొత్తాన్ని మీ ఆదాయంగానే లెక్కించి ఐటీఆర్‌లో చూపించాలి. ఒకవేళ ఉచిత హోటల్ స్టే లేదా విమాన టికెట్లు ఇస్తే వాటి కమర్షియల్ విలువను లెక్కించి బుక్స్ లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ల నుంచి మీకు లభించిన గిఫ్టుల మొత్తం విలువ రూ.50 వేల లోపు ఉంటే వాటిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక వేళ సదరు వస్తువును కేవలం రివ్యూ లేదా అన్బాక్సింగ్ కోసం వాడుకుని ఆ తర్వాత తిరిగి ఇస్తే దానిపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
కానీ, రూ.50 వేల పరిమితి దాటితే మాత్రం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అన్ని వివరాలను ఐటీ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్లు పన్నులు దాచకుండా ఉండేందుకు ఆదాయపు పన్ను చట్టంలో కీలక రూల్ ఉంది. ఏదైనా బ్రాండ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఒక ఆర్థిక ఏడాదిలో రూ.20 వేల కంటే ఎక్కువ విలువైన బిజినెస్ బెనిఫిట్స్, గిఫ్ట్స్ ఇస్తే సదరు బ్రాండ్ కచ్చితంగా 10 శాతం టీడీఎస్ కట్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలి.
ఈ
టీడీఎస్ వివరాలు ఇన్ఫ్లుయెన్శర్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS), ఫామ్ 26ఏఎస్‌లో ఆటోమేటిక్ గా చేరతాయి. కాబట్టి వీటిని ఐటీఆర్ ఫైలింగ్ లో దాచడం కుదరదు. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం (పాత చట్టంలో సెక్షన్ 194ఆర్) నగదు యోతర బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు కూడా బ్రాండ్లు సదరు ఇన్ఫ్లుయెన్సర్ పాన్ కార్డ్ ఆధారంగా టీడీఎస్ కట్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలి.
ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఆదాయాన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద చూపించాలి. ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఖర్చులు, ఆదాయాల బుక్స్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తుంటే ఐటీఆర్-3 ఫారం ఎంచుకోవాలి. ఒక వేళ ఎలాంటి బుక్స్ లేకుంటే ప్రిజమ్ప్టివ్ టాక్సేషన్ స్కీమ్ (సెక్షన్ 44డీఏ) కింద 50 శాతం ఆదాయాన్ని లాభంగా చూపించాలనుకుంటే ఐటీఆర్ 4 ఫారం ఉపయోగించవచ్చు.
ఇన్ఫ్లుయెన్సర్లు భవిష్యత్తులో ఐటీ నోటీసుల బారిన పడకుండా ఉండాలంటే బ్రాండ్లతో చేసుకునే కొలాబరేషన్ అగ్రిమెంట్లు, ఇన్వాయిస్లు, లభించిన ప్రొడక్ట్స్ మార్కెట్ ధరల వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రిజమ్ప్టివ్ టాక్సేషన్ ఎంచుకున్నప్పటికీ రేపు ఏదైనా స్క్రూటినీ లేదా వెరిఫికేషన్ ఎదురైతే చూపించేందుకు కనీస ఆధారాలు కలిగి ఉండటం చాలా ఉత్తమం.
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి