
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ రీఎగ్జామ్ (NEET Retest)లో ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యున్నత, సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్, ముఖ గుర్తింపుతో ప్రవేశం వంటి చర్యలు తీసుకుంటోంది.
అయితే, ఇటువంటి కఠిన ఏర్పాట్లతో విద్యార్థులపై ఇప్పటికే ఉన్న పరీక్ష ఒత్తిడి మరింత పెరుగుతుందని ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన అన్నామలై పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. చైనాలో అత్యంత కఠినమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘గౌకావో’కూ ఇలాంటి ఏర్పాట్లే ఉంటాయని తెలిపింది.
‘‘వాయుసేన విమానాల వినియోగం, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత, నాలుగంచెల సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు, అనేక దశల తనిఖీలు, ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఇవన్నీ ఏదో అత్యున్నత స్థాయి, రహస్య, సైనిక శ్రేణి సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం చేసిన ఏర్పాట్లు కావు.
నీట్ రీటెస్ట్ కోసం చేసినవి. కఠినమైన తనిఖీ ప్రక్రియలు, పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పొడిగించడం వంటివి.. ఇప్పటికే విద్యార్థులపై ఉన్న పరీక్ష ఒత్తిడిని మరింత పెంచుతాయి. ఇది మన పరీక్షా వ్యవస్థ అసలు ఉద్దేశాన్ని, పరీక్షల ఒత్తిడిని తగ్గించాలన్న జాతీయ విద్యావిధానం 2020 లక్ష్యాన్నీ నీరుగారుస్తోంది.
ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సమస్యలు వస్తున్నాయి. నీట్ రీటెస్ట్ కోసం తీసుకుంటున్న చర్యలు.. అసలు సమస్యను పరిష్కరించకపోగా, కొత్తవి సృష్టించే అవకాశం ఉంది’’ అని అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
నీట్ రీటెస్ట్.. టెలిగ్రామ్ యాప్‌ను బ్లాక్ చేసిన కేంద్రం అన్నామలై వాదనలను భాజపా నేత వినోజ్ పి. సెల్వమ్ ఖండించారు. ‘‘పెద్దఎత్తున జరిగే పరీక్షల్లో బయోమెట్రిక్, సీసీటీవీ నిఘా, భద్రతా తనిఖీలు, పర్యవేక్షణ అనేవి ప్రామాణికంగా అనుసరించే పద్ధతులే.
ఎవరూ ‘సైనికీకరణ’ అని అనరు. అగ్రదేశాలతో భారత్ పోటీపడుతూ.. గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నప్పుడు మనకూ విశ్వసనీయతతో కూడిన, నిష్పక్షపాతమైన పోటీ అవసరం. పరీక్షల నిబంధనలు అమలు చేసినప్పుడు.. రాజకీయ భయాందోళనలు సృష్టించకుండా, విద్యార్థులకు వ్యవస్థపై విశ్వాసం కల్పించాలి’’ అని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చైనాలో ఏటా 1.3 కోట్ల మంది విద్యార్థులు కఠిన నిబంధనల కింద ‘గౌకావో’ పరీక్ష రాస్తారు. దానిని