
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించే కంటెంట్ ప్రచారం అవుతోందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సౌరభ్ గంగూలీ ఫ్యాన్స్’ అనే అనధికార ఫేస్బుక్ పేజీతోపాటు మరో మీడియా సంస్థ తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కల్పిత సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ‘‘నా ప్రతిష్ఠను దెబ్బతీసి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించే ఉద్దేశంతో ఆ పేజీ నిరంతరం పోస్టులను షేర్ చేస్తోంది. ఒక ప్రముఖ వ్యక్తిగా అభిప్రాయాలు, విమర్శలు ప్రజా జీవితంలో భాగమని నాకు తెలుసు.
అయితే, నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే, పరువుకు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ పేజీని నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.